మండుతున్న భూమి

ప్రపంచ మానవాళి కూర్చున్న కొమ్మనే నరుక్కుంటోంది. మానవులు చేస్తున్న పర్యావరణ విఘాత చర్యల వల్ల దారుణమైన ఫలితాలు వస్తున్నాయి. అయినా మనలో చలనం రావడం లేదు. గతంలో ఎన్నడూ లేనంతగా ఆర్కిటిక్ సముద్రపు మంచు వేగంగా కరుగుతోంది. ఇది అత్యంత ప్రమాదకరణ పరిణామని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సముద్రంతో పాటుగా భూ ఉపరితల వాతావరణం కూడా రోజురోజుకూ వేడెక్కుతోంది. గత మూడు సంవత్సరాలుగా భూ వాతావరణం ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం పెరిగిపోతూనే ఉంది. 2016లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ముఖ్యంగా భారత్ తో పాటగా ఇరాన్, కువైట్ లలో ఉష్ణోగ్రతలు మరింత ఎక్కువగా నమోదయ్యాయి. గత సంవత్సరం సగటును భూమి వాతావరణం 0.04 శాతం పెరిగింది. గత మూడు సంవత్సరాలుగా భూమి వాతారవణం పెరుగుతూనే ఉంది. వాతావరణంలో పెరుగు 0.04 శాతం గానే ఉన్నా అది పర్యావరణ పరంగా చాలా ఎక్కువని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.

వేగంగా పెరుగుతున్న భూమి ఉష్ణోగ్రతలు అనేక ప్రతికూల పరిణామాలకు దారితీస్తుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్యాస్,చమురు వంటి శిలాజ ఇంధనాలను మండిచడం భూమి వాతావరణం వేడెక్కడానికి ప్రధాన కారణంగా చెప్తున్నారు. విచ్చలవిడిగా సహజవనరులను ద్వంసం చేయడం గ్యాస్, చమురు ఉత్పత్తులను నియంత్రణ లేకుండా మండించడం వంటి చర్యలు పర్యావరణానికి తీవ్ర విఘాతం కలిగిస్తున్నాయి.

మానవుడు ఇప్పటికైనా మేల్కొని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోని పక్షంలో రానున్న రోజుల్లో మరింత కష్టాలు పడకతప్పదని హెచ్చరిస్తున్నారు.