బెర్లిన్ ఉగ్రవాద దాడి అనుమాతుడి కాల్చివేత

జర్మనీ రాజధాని బెర్లిన్ లో ఉగ్రదాడికి పాల్పడి 12 మంది మరణానికి కారణం అయిన వ్యక్తిని పోలీసులు కాల్చిచంపారు. ఈ ఘటనతో సంబంధం ఉందని అనుమానిస్తున్న ఆమిర్ అనే వ్యక్తిని ఇటలీలోని మిలాన్ లో కాల్చి చంపినట్టు పోలీసులు వెళ్లడించారు. మిలాన్ రైల్వే స్టేషన్ వద్ద ఆమీర్ ను పోలీసులు అరెస్టు చేసేందుకు ప్రయత్నించగా అతను పోలీసులపై కాల్పులు జరిపాడని దానితో తాము కూడా ఆమీర్ పై కాల్పులు జరపడంతో అతను అక్కడికక్కడే మృతి చెందినట్టు పోలీసులు వెళ్లడింతారు.  బెర్లిన్ లోని క్రిస్ మస్ మార్కెట్ లోకి ట్రక్కుతో దూసుకుని వచ్చి పాదచారులపైకి ట్రక్కును దూకించిన ఘటనలో 12 మంది మరణించగా 50 మందికి పైగా గాయపడ్డారు. గాయపడ్డవారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనకు పాల్పడిందని తామేనని ఐఎస్ఐఎస్ ప్రకటించిన సంగతి తెలిసిందే . ఉగ్రదాడికి పాల్పడిన వ్యక్తిని పాకిస్థాన్ జాతీయుడిగా పోలీసులు  గుర్తించారు.