నిమజ్జన తేదీపై ఉత్సవ సమితి స్పష్టత

0
60
Hyderabad: Devotees participate in a Ganesh Visarjan procession at Mozamjahi Market in Hyderabad on Monday. PTI Photo (PTI9_8_2014_000243A)

హైదరాబాద్ లో సామూహిక వినాయక నిమజ్జన కార్యక్రమం సెప్టెంబర్ 5వ తేదీనే జరుగుతుందని భ్యాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి స్పష్టం చేసింది. నిమజ్జన తేదీపై కొంత మంది అనుమానాలు వ్యక్తం కావడంతో గణేష్ ఉత్సవసమితి నిమజ్జన తేదీలో ఎటువంటి మార్పు లేదని స్పష్టం చేసింది. వినాయక చవితి నుండి చతుర్థసి దాకా పూజలు అందుకునే గణనాథులను అదే రోజు నిమజ్జనం చేయడం ఆనవాయితీ. అయితే ఈ సారి చతుర్థసి మంగళవారం రావడంతో నిమజ్జన తేదీపై కొంత మంది అనుమానాలు వ్యక్తం చేశారు. మంగళవారం నాడు నిమజ్జన కార్యక్రమం ఉండదని అందుచేత సోమవారమే సామూహిక నిమజ్జనం ఉంటుందనే ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తలను గణేష్ ఉత్సవ సమితి కొట్టివేసింది. వినాయ నిమజ్జనానికి వారాలతో ఎటువంటి ప్రమేయం లేదని పండితులు చెప్పిన విషయాన్ని గుర్తు చేసిన ఉత్సవ సమితి నేతలు నిమజ్జన కార్యక్రమంలో ఎటువంటి అనుమానాలు పెట్టుకోవద్దని స్పష్టం చేశారు.

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here