చెత్తకుప్పల్లో గణనాధుల విగ్రహాలు…

0
59

వినాయక చవితి నాడు ప్రతీ ఇళ్లలోనూ… మండపాల్లోనూ కొలువు దీరిన గణనాధులను చిన్నా పెద్ద అంతా భక్తుతో పూజించుకుంటాం… కోరిన కోర్కెలు తీర్చాలని గుంజీళ్లు తీస్తాం… అయితే మనం ఇళ్లలోనూ… మండపాల్లోనూ కొలువు దీరిన గణనాధులు పూజలు అందుకుంటూ ఉంటూ మరో పక్క మరికొన్ని బొజ్జ గణపయ్య విగ్రహాలు మాత్రం మురికి కాలువల పక్కన, చెత్త కుండీల సమీపంలోనూ దర్శన మిస్తున్నాయి. వినాయక చవితిని పురస్కరించుకుని పెద్ద ఎత్తున వినాయకుడి విగ్రహాల అమ్మకాలు జోరుగా సాగుతాయి. విగ్రహాలను తయారు చేసే వారు మొదలు వాటిని అమ్మె వ్యాపారుల దాకా కోట్లాది రూపాయల వ్యాపారాన్ని నిర్వహించుకుంటారు. తీరా పండుగ అయిపోయిన తరువాత మిగిలిపోయిన విగ్రహాలను తిరిగి తీసుకుని పోకుండా రోడ్డు పక్కనే ఉంచేయడంతో అవి ఎండకు ఎండి… వానకు తడిసి చివరకు చెత్త కుండీల పాలవుతున్నాయి.
ఎంతో పవిత్రంగా కొల్చుకొనే వినాయక విగ్రహాలు రోడ్డుపాలు కావడం పై పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భక్తి శ్రద్దలతో కొల్చుకునే వినాయక విగ్రహాలు చెత్త కుండీల సమీపంలోకి చేరడాన్ని భక్తులు జీర్ణించుకోలేకపోతున్నారు. పండుగ అయిపోయిన తరువాత వినాయక విగ్రహాలకు గిరాకీ లేక తీసుకుని వచ్చిన విగ్రహాలను తిరిగి తీసుకుని పోవడానికి రవాణా ఖర్చులు ఎక్కువ కావడం తో మగిలిపోయిన విగ్రహాలను రోడ్డు మీదనే వదిలేస్తుండడంతో అవి చివరకు చెత్త కుండీలను చేరుతున్నాయి. మిలిన విగ్రహాలను తీసుకుని పోయినా వచ్చే సంవత్సరం దాకా వాటిని భద్రపర్చే వీలు లేకపోవడం వంటి సమస్యలతో వ్యాపారులు కొందరు వాటిని రోడ్డు పైనే వదిలి వెళ్తున్నారు. పెద్ద పెద్ద విగ్రహాలను భద్రపరుస్తున్నా చిన్న చిన్న విగ్రహాలను మాత్రం రోడ్డు పైనే వదిలేసి వెళ్తున్నారు.
నాగోల్ నుండి ఉప్పల్ కు వెళ్లే దారిలో అనేక వినాయక విగ్రహాలు మురికి నీటిలో నానుతూ దర్శన మిచ్చాయి. మట్టి వినాయకుడి విగ్రహాలకు ఆదరణ పెరగడంతో రంగు రంగుల స్లాస్టరాఫ్ ప్యారిస్ విగ్రహాలకు డిమాండ్ తగ్గింది. వీటి అమ్మకాలు తగ్గిపోవడంతో వాటిని అట్లాగే వదిలివేయడంతో అవి పూర్తిగా పాడై పోయాయి. పండుగ నాడు కురిసిన వర్షం వల్ల కూడా మిగిలిన విగ్రహాలను తీసుకుని వెళ్లే వీలులేక వాటిని వ్యాపారులు వదిలేసి వెళ్లినట్టు సమాచారం.
మురికి నీటిలో చెత్తకుండీల్లోకి చేరిన బొజ్జ గణపయ్య బేలగా వచ్చీపోయే వాహనాలను చూస్తూ ఉండిపోయినట్టుగా కనిపిస్తోంది.Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here