కేంద్రం మోసం చేసింది…మోడీ ముంచారు: గల్లా జయదేవ్

కేంద్ర ప్రభుత్వం పై తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాసం తీర్మానంపై చర్చను ఆ పార్టీ సభ్యులు గల్లా జయదేవ్ ప్రారంభించారు. తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న గల్లా కేంద్ర ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో విరుచుకుని పడ్డారు. తమను కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా మోసంచేసింది ఆయన లెక్కలతో సహావివరించారు. తన బావ మహేష్ బాబు నటించిన ‘భరత్ అను నేను’ సినిమాను ప్రస్తావిస్తూ మాటకు కట్టుబడాల్సిన బాధ్యతను ఆ సినిమా చక్కగా చూపించారంటూ చర్చలోకి వచ్చిన గల్లా జయదేవ్ ఏపీకి కేంద్ర ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని ప్రస్తావించారు.
1. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేత ప్రతిపత్తి ఇస్తామంటూ చేసిన వాగ్దాదాన్ని ప్రధాని నెలబెట్టుకోలేదు.
2. తెలంగాణకు ఆస్తులు ఇచ్చి మాకు అప్పులు మిగిల్చారు.
3. పార్లమెంటులో ప్రధాని ఇచ్చిన హామీని నెరవేర్చకపోవడం దారుణం.
4. 10 సంవత్సరాల పాటు ప్రత్యేక హోదా కావాలంటూ డిమాండ్ చేసింది బీజేపీ కాదా…?
5. ఇది మెజార్టీకీ మైనార్టీకీ మధ్య జరుగుతున్న పోరాటం.
6. హైదరాబాద్ ను నాటి ఏపీలోని అన్ని ప్రాంతాల వారు అభివృద్ధి చేశారు.
7. హైదరాబాద్ తెలంగాణలోనే ఉండిపోవడంతో ఏపీ పెద్ద ఆదాయ వనరును కోల్పోయింది.
8. ఏపీ పునర్విభజన బిల్లు ఆమోదం పొందడంలో కాంగ్రెస్‌తో పాటు భాజపా ప్రధాన పాత్ర పోషించింది
9. అప్రజాస్వామిక పద్దతిలో రాష్ట్రాన్ని విభజించారు.
10. ఏపీకి కేంద్రం సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదు.
11. పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే పారిశ్రామిక, సేవల రంగంలో అట్టడుగునే ఉంది. తలసరి ఆదాయంలోనూ ఏపీ వెనుకబడే ఉంది.
12. కాంగ్రెస్ తల్లిని చంపేసి బిడ్డను బతికించిందని నాడు మోడీ వ్యాఖ్యానించారు.
13. నెల్లూరు సభల్లో నరేంద్ర మోడీ హామీలు గుర్తున్నాయా?
14. గుజరాత్ పటేల్‌ విగ్రహానికి రూ.3,500కోట్లు, మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ విగ్రహానికి రూ.3వేల కోట్లు రాజధానికి వెయ్యి కోట్లు ఇవ్వడం దారుణం కాదా..?
15. పోలవరానికి రూ.58,600 కోట్లయితే.. రూ.6వేల కోట్లు మాత్రమే ఇచ్చారు.
ఢిల్లీ కంటే పెద్ద రాజధానిని నిర్మిస్తామంటూ నాడు ప్రధాని మోడీ చేసిన ప్రకటనతో రాజధాని కోసం రైతులు భూములను విరాళంగా ఇచ్చారు. తీరా రాజధాని నిర్మాణానికి కేంద్రం ఏమాత్రం సహరించడంలేదని గల్లా జయదేవ్ అన్నారు.