డీకే ఆరుణ కు షాకిచ్చేందుకు టీఆర్ఎస్ వ్యూహాలు

0
97
డీకే ఆరుణ
dk-aruna-gadwala-mla

గద్వాల కోటను వశం చేసుకునేందుకు టీఆర్ఎస్ పార్టీ ఇప్పటి నుండే పావులు కదుపుతోంది. గద్వాల నియోజకవర్గం నుండి ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న డీకే ఆరుణ ను ఎట్లాగైనా ఓడించాలనే పట్టుదలతో ఉన్న టీఆర్ఎస్ అందుకు తగ్గట్టు ఇప్పటినుండే వ్యూహా రచన చేస్తున్నట్టు సమాచారం. కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న గద్వాల్ ను తమ ఖాతాలో వేసుకునేందుకు టీఆర్ఎస్ ఉవ్వీళ్లూరుతున్నది. కాంగ్రెస్ పార్టీకి గట్టి పట్టున్న జిల్లాల్లో విభజనకు పూర్వపు మహబూబ్ నగర్ కూడా ఒకటి. ఈ జిల్లాపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించిన టీఆర్ఎస్ అందుకు అనుగుణంగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. బలమైన నాయకులను తనవైపు తిప్పుకుంటోంది.తాజాగా ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు అబ్రహం, ఎడ్మ కిష్టారెడ్డి సైతం టీఆర్ఎస్ లో చేరగా గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున గెలిచిన మక్తల్‌ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, టీడీపీ తరఫున గెలిచిన నారాయణపేట ఎమ్మెల్యే ఎస్‌.రాజేందర్‌రెడ్డిలు ఇప్పటికే టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.
గద్వాల ఎమ్మెల్యే డీకే ఆరుణ కూడా టీఆర్ఎస్ లో చేరుతున్నట్టు జోరుగా ప్రచారం జరిగింది. ఆమె చేరిక దాదాపుగా ఖాయం అయిపోయిందనే అంతా భావించినా ఆఖరినిమిషంలో సమీకరణాల్లో వచ్చిన మార్పుతో ఆమె కాంగ్రెస్ లోనే ఉండిపోయారనే ప్రచారం జరిగింది. ఆ తరువాత డీకే ఆరుణ టీఆర్ఎస్ పార్టీతో పాటుగా ముఖ్యమంత్రి కేసీఆర్ పైనా స్వరం పెంచారు. పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నారు. గద్వాల నియోజక వర్గాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీఅర్ఎస్ ఇప్పటి నుండే దానిపై దృష్టిపెట్టినట్టు తెలుస్తోంది. అందుకు తగ్గట్టుగానే తన వ్యూహాలకు పదనుపెడుతోంది.
అయితే టీఆర్ఎస్ వ్యూహాలు ఎంతవరకు ఫలిస్తాయనేది మాత్రం అనుమానాస్పదంగానే ఉంది. నియోజకవర్గంపై గట్టిపట్టున్న డీకే ఆరుణ ను ఓడించడం అంత ఆషామాషీ కాదన్న విషయం టీఆర్ఎస్ కు తెలియంది కాదు. నియోజవర్గంలోని ప్రతీ ప్రాంతంలోనూ ఆమెకు గట్టి మద్దతుదారులే ఉన్నారు. ఇటు పార్టీలోని పరిణామాలు కూడా టీఆర్ఎస్ కు ఇబ్బందులు సృష్టిస్తున్నాయి. నియోజకవర్గంలోని నేతల మధ్య అవగాహనలేమి, ఆధిపత్యపోరు ఆ పార్టీకి తలనొప్పిగా మారింది. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున పోటీచేసిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మరోసారి డీకే అరుణను ఢీకొట్టేందుకు సమాయత్తం అవుతున్నారు. నియోకవర్గంలో విరివిగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్నారు. అయితే బీసీ కమిషన్ సభ్యుడుఆంజనేయులు గౌడ్, బండ్ల చంద్రారెడ్డిలు కూడా టికెట్ ను ఆశిస్తున్నారు. వారు కూడా నియోజవర్గంలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. దీనితో నియోజకవర్గంలో పార్టీ మూడు వర్గాలుగా చీలిపోయింది.
ఎవరికివారు ప్రత్యర్థులను ఇరుకునపెట్టే ప్రయత్నాలు చేస్తుండడంతో కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు. డేకే అరుణకు గట్టి షాకివ్వాలని ఓ వైపు పార్టీ అధిష్టానం ప్రయత్నాలు చేస్తున్న సమయంలో ఇటు పార్టీలోని అంతర్గత సమస్యలు వారిని ఇరుకునపెడుతున్నాయి. అయితే ఇవన్నీ తాత్కాలికమేనని పార్టీలో ఐక్యతను ఎటువంటి ఢోకాలేదని పార్టీ పెద్దలు చెప్తున్నారు. చిన్న చిన్న సమస్యలు ఉన్నా అందరు నేతలు ఓకే తాటిపైకి వచ్చి పనిచేస్తారని వచ్చే ఎన్నికల్లో డీకే అరుణ ను ఓడించడం ఖాయమని అంటున్నారు. అయితే ఆఖరి నిమిషంలో కొన్ని అనూహ్య పరిణామాలు జరిగినా జరగవచ్చని జిల్లా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.
d.k.aruna, dk aruna, aruna dk, ex minister dk aruna, gadwal, gadwala, gadwala assembly, palamur.

తెలంగాణ ప్రజల చేతికి చిప్పే : షబ్బీర్ అలీ


ప్రణబ్ ముఖర్జి పై ఊహాగానాలకు తెర
Gadwal

Wanna Share it with loved ones?