జనసేనతో గద్దర్ దోస్తీ…!

0
58

గుమ్మడి విఠల్ రావు అంటే ఎవరో చాలా మందికి తెలియకపోవచ్చు గానీ గద్దర్ అంటే తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారుండరు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని పల్లెపల్లెలో ఆయన పాటలు వినపడతాయి. ప్రజా కవి, గాయకుడు, మావో సానుభూతి పరుడు, తెలంగాణ పోరాటయోధుడు చెప్పుకుంటూ పోతే ఇట్లా ఎన్నో… తన మాటలను పాటరూపంలో పేల్చిన పోరాటయోధుడు గద్దర్ దశబ్దులుగా మావోయిస్టు పార్టీతో బంధాన్ని తెంపుకున్నారు. ఇక నుండి తాను కూడా ప్రజాస్వామ్యవాదినని ప్రకటించారు. ఓటు వేయోద్దని పల్లెపల్లెకూ తిరిగి ప్రచారం చేసిన గద్దర్ ఇక ఓటు కోసం గడప..గడప ఎక్కనున్నారు. నక్సలైట్లతో ప్రభుత్వం జరిగిన  చర్చల్లో మవోయిస్టుల తరపున వరవరరావు, కళ్యాణరావులతో పాటు కలిసి పాల్గొన్న గద్దర్ ఇక మావోయిస్టు పార్టీని వదిలి ప్రజాస్వామ్య బాట పట్టారు.
ఎర్రజెండాను వదిలిపెట్టిన గద్దర్ ఇప్పుడు ఏ పార్టీ జెండాను చేతబూనుతాడనేది ప్రశ్నర్థకంగా మారింది. ఆయన మాట్లాడిన తీరును బట్టి, ‘పోదమురో జన సేనతో’ అంటూ పాడిన పాటను బట్టి గద్దర్ ఇపుడు ఏ పార్టీ వైపు అడుగులు కదుపుతున్నారో స్పష్టంగా తెలిసిపోయింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన ప్రసంగాల్లో చాలా సార్లు గద్దరు పేరును ప్రస్తావించడం తెలిసిందే. రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా ఎన్నికల్లో పోటీ చేస్తానంటూ ప్రకటించన జనసేనకు గద్దర్ మద్దతు పలుకుతారని సమాచారం. తాను స్వంతగా పార్టీ పెట్టే ఆలోచన లేదని ప్రకటించిన గద్దర్ జనసేన పార్టీలో నేరుగా చేరకపోయినా ఆ పార్టీకి మద్దతు ఇస్తారని తెలుస్తోంది. ఇప్పటికే తెలంగాణలో ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక కోసం ప్రయత్నాలు సాగుతున్నాయి. అంబేద్కర్, పూలే ఆశయాల సాధన కోసం కొత్త రాజకీయ వేదిక కోసం బలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఏర్పడే రాజకీయ ప్రత్యామ్నాయలను ఒక వేదికపైకి తీసుకుని వచ్చే పనిలో గద్దర్ ఉన్నారని తెలుస్తోంది.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ప్రజాకవి గద్దర్ కలిసి పనిచేస్తారని సమాచారం. వీరిద్దరిని కలపడంలో ఇద్దరు జర్నలిస్టులు కీలక పాత్ర పోషించినట్టు తెలుస్తోంది. గద్దర్, పవన్ కళ్యాణ్ లు కలిస్తే తెలంగాణ మంచి  భవిష్యత్తు ఉంటుందని సరదు జర్నలిస్టు ఇద్దరినీ కలపడంలో కీలకంగా వ్యవహరించినట్టు సమాచారం. తనది వామపక్ష భావజాలమని మొదటి నుండి చెప్పే పవన్ కళ్యాణ్ 2014 ఎన్నికలకు ముందు బీజేపీకి జై కొట్టారు. ఇది వీరిద్దరి కలయికకు కాస్త ఇబ్బందిగా మారినా ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ బీజేపీని ముఖ్యంగా మోడీపై తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నారు. సామాజిక బలం, సినీ బలంతో ఆంధ్రప్రదేశ్ లోనూ, గద్దర్ లాంటి నాయకుల నీడలో తెలంగాణలోనూ జనసేన బలపడడానికి పవన్ కళ్యాణ్ బాటలు వేస్తున్నట్టు కనిపిస్తోంది.

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here