రాజ్ ఘాట్ సమీపంలో వాజ్ పేయి అంత్యక్రియలు

0
58
వాజ్ పేయి అంత్యక్రియలు

భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి పార్థీవదేహాన్ని ఎయిమ్స్ నుండి ఆయన నివాసానికి తరలించారు. అనారోగ్యంతో ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్నా ఆయన గురువారం సాయంత్రం 5.05 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. పెద్ద ఎత్తున బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆయన నివాసానికి చేరుకుంటున్నారు. ముందు జాగ్రత్త చర్యగా వాజ్ పేయి నివాసం వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. వాయి పేయి నివాసం నుండి ఆయన మృతదేహాన్ని శుక్రవారం ఉదయం 9.30 బీజేపీ కార్యాలయానికి తరలించనున్నారు. ప్రజల సందర్శనార్థం ఆయన మృతదేహాన్ని మద్యాహ్నం 1.30 వరకు అక్కడే ఉంచిన తరువాత ఆయన అంతిమ యాత్ర మొదలవుతుంది.
రాజ్ ఘాట్ కు సమీపంలోని రాష్ట్రీయ స్మృతి స్థల్ లో సాయంత్రం 5.30కు అంత్యక్రియలు జరుగుతాయి. రాజ్ ఘాట్ కు సమీపంలోని 1.5 ఎకరాల స్థలాన్ని కేంద్ర ప్రభుత్వం వాజ్ పేయి స్మృతి వనానికి కేటాయించింది.
వాజ్ పేయి మరణానికి సంతాపంగా 7 రోజులపాటు సంతాప దినాలుగా పాటించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దేశంలోని అన్ని జాతీయ పతాకాలను సగం వరకు అవనతం చేయాలని కేంద్ర ప్రభుత్వం అదేశాలు జారీచేసింది. ఢిల్లీలోని పాఠశాలలు, కాలేజీలకు సెలవు ప్రకటించింది. పూర్తి సైనిక లాంఛనాలతో వాజ్ పేయి అంత్యక్రియలు జరుగుతాయి.
వాజ్ పేయి మరణవార్తతో దేశవ్యాప్తంగా విషాధచాయలు అలముకున్నాయి. పార్టీలకు అతీతంగా వాజ్ పేయి అభిమానులు విచారంలో మునిగిపోయారు. దేశం ఒక గొప్ప నేతను కోల్పోయిందని పలువురు వ్యాఖ్యానించారు. వాజ్ పేయి మరణ వార్త విన్న వెంటనే ఆయనకు సంతాపం తెలుపుతునూ సామాజిక మాధ్యమాల్లో సంతాపసందేశాలు వెల్లువెత్తాయి.
వాజ్ పేయి మరణం పట్ల రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విచారం వ్యక్తం చేశారు. దేశం ఒక మహానేతను కోల్పోయిందని వారు వేర్వేరుగా తమ సంతాప సందేశంలో పేర్కొన్నారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్చీ, మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ తదితరులు వాజ్ పేయి మరణం పట్ల తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తో పాటుగా పార్టీలకు అతీతంగా ప్రతీ ఒక్కరూ దేశానికి వాజ్ పేయి చేసిన సేవలను కొనియాడారు. దేశం గొప్ప దార్శనికుడిని కోల్పోయిందని తమ తమ సంతాప సందేశాల్లో విచారం వ్యక్తం చేశారు.
తెలుగా రాష్ట్రాల గవర్న నరసింహన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి, జనసేన పార్టీ నేత పవన్ కళ్యాణ్ సహా పలువురు తెలుగు ప్రముఖులు వాజ్ పేయి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ ఆయనతో తమకున్న సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకున్నారు.
Atal Bihari Vajpayee,Funeral procession begin at 1.30pm, BJP chief Amit Shah,The last rites ceremony will be held at Smriti Sthal,former prime minister’s residence.

అటల్ బిహారీ వాజ్ పేయి జీవిత విశేషాలురతమాత మొడలోని కౌస్థుబం-ఈ భారత రత్నం

Wanna Share it with loved ones?