హైదరాబాద్ ఎగ్జిబిషన్ లో భారీ అగ్నిప్రమాదం

fire accident in hyderabad exhibitionn హైదరాబాద్ నాంపల్లి ఎగ్ఝిషన్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో భారీగా అస్తి నష్టం జరిగినప్పటికీ ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. అగ్నికి దాదాపు 400 వరకు స్టాల్స్ అగ్నికి ఆహుతైనట్టు తెలుస్తోంది. ఆంధ్రాబ్యాంకు చెందిన స్టాల్ లో షాట్ సర్యూట్ వల్ల ఎగిసిపడిన నిప్పురవ్వలు క్షణాల్లో వ్యాప్తి చెందాయని ప్రత్యక్షసాక్షులు చెప్తున్నారు. మరోవైపు గ్యాస్ లీకేజీ వల్లే ఈ ప్రమాదం జరిగిందని కొంత మంది చెప్తున్నారు. ముఖ్యమంగా ప్లాస్టిక్, దుస్తుల స్టాళ్లు అధికంగా ఉండడంతో మంటలు వెంటనే పక్క దుకాణాలకు వ్యాపిస్తూ పోయాయి. మంటలను అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక దళ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నప్పటికీ పరిస్థితి అదుపులోకి రాలేదు.
భారీ ఎత్తున మంటలు ఎగిసిపడడంతో ఎగ్జిభిషన్ ను వచ్చిన సందర్శకులు భయాందోళనకు గురయ్యారు. దీనితో కొద్దిగా తొక్కిసలాట జరిగింది. ఇందులో కొంత మందికి గాయాలయినట్టు తెలుస్తోంది. అటు మంటలను అదుపులోకి తెచ్చే క్రమంలో అగ్ని మాపక సిబ్బందితోపాటుగా దుకాణుదారులకు స్వల్పంగా గాయాలయ్యాయి.
చిన్నగా మంటలు మొదలైనపుడే వాటిని అదుపుచేసే ప్రయత్నం చేయలేదని, నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే ఇంత భారీ స్థాయిలో ప్రమాదం చోటుచేసుకుందని పలువురు దుకాణుదారులు ఆరోపిస్తున్నారు.
fire accident in hyderabad exhibition