ఫేస్ బుక్ అకౌంట్లకూ ఆధార్ తో అనుసంధానం..?

0
44

భారత్ లో ప్రతీ సర్వీసును ఆధార్ తో అనుసంధానం చేస్తున్నారు. దీనిపై సామాజిక మాధ్యమాల్లో కూడా అనేక జోకులు ప్రచారంలో ఉన్నాయి. ప్రసుఖ సామాజిక మాధ్యమం ఫేస్ బుక్ ఖాతాకు కూడా ఇక నుండి ఆధార్ కార్డు తప్పనిసరిగా మారబోతున్నట్టు కనిపిస్తోంది. ఫేస్ బుక్ ఖాతాదారులను ఆధార్ కార్డు నెంబర్ ను అడగబోతున్నారు. అయితే ప్రతీ ఖాతాకు ఆదార్ కార్డును జతపర్చాల్సిన అవసరం లేదని అయితే అనుమానాస్పద ఖాతాల విషయంలో మాత్రం తప్పనిసరిగా ఆధార్ కార్డు నెంబర్ ను ఫేస్ బుక్ అడగనుంది. ప్రస్తుతానికి మొబైల్ సైట్ లో ఖాతాలు తెరుస్తున్న వారికి సంబంధించి ఆధార కార్డువివరాలను ఫేస్ బుక్ అడుగుతోంది.
ఫేస్ బుక్ లో నకిలీ ఖాతాలు పెద్ద మొత్తంలో పెరిగిపోయాయి. నకిలీ ఖాతాలను మోసాలకు పాల్పడుతున్నవారు కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. దీని వల్ల అటువంటి ఖాతాల పనిపట్టే క్రమంలో ఫేస్ బుక్ అకైంట్లకు సంబందించి ఆధార్ నెంబర్ తీసుకోవడాన్ని ఫేస్ బుక్ పరిశీలిస్తోంది. ఇప్పటికి కొందరి అకౌంట్లతో దీన్ని పరిమితం చేసినా రానున్న రోజుల్లో అన్ని ఖాతాలకు ఇది వర్తింపచేయవచ్చని భావిస్తున్నారు. ఫేస్ బుక్ లలో నకిలీ ఖాతాలపై దృష్టిపెట్టిన ఆ సంస్థ ఇప్పుడు వాటిని ఏరివేసే పనిలోపడింది. ఇప్పటికే పెద్ద సంఖ్యలో నకిలీ ఖాతాలను పేస్ బుక్ మూసేసింది.

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here