తప్పు ఒప్పుకున్న ఫేస్ బుక్

ఫేస్ బుక్ తన తప్పును ఒప్పుకుంది. కోట్లాది మంది ప్రజల వ్యక్తిగత సమాచారం దుర్వినియోగం అయినట్టు సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ పై వస్తున్న ఆరోపణలపై ఆ సంస్థం సీఈఓ స్పందించారు. సమాచారాన్ని రహస్యంగా ఉంచడంలో పొరపాటు జరిగిందని అంగీకరించారు. తమ పొరబాట్లను పూర్తిగా సరిదిద్దుకుంటున్నట్టు ఆయన చెప్పారు.
మరోసారి ఇటువంటి పొరపాట్లు జరక్కుండా అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నట్టు ఆయన వివరించారు. తన వివరణను ఆయన తన ఫేస్ బుక్ పేజీలో ఉంచారు. ఖతాదారుల వ్యక్తిగత సమాచారం తమకు చాలా ముఖ్యమని చెప్పిన ఆయన సమాచారాన్ని భద్రంగా ఉంచడం కోసం మరిన్ని చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ కోసం పనిచేసిన కేంబ్రిడ్జ్‌ అనలిటికా సంస్థ దాదాపు 5కోట్ల మంది దాగా ఫెస్ బుక్ వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని అక్రమ మార్గాల్లో సంపాదించినట్టు వార్తలు వచ్చాయి. దీనిపై అమెరికాతో పాటుగా యూరప్ లోనూ కేసులు నమోదయ్యాయి. సామాజిక మాధ్యమ దిగ్గజ సీఇఓకు కూడా సమన్లు అందాయి.
ఇటు భారత్ కూడా ఫేస్ బుక్ కు తీవ్రస్థాయిలోనే హెచ్చరికలు చేసింది. రానున్న భారత ఎన్నికల్లో ఇక్కడి వినియోగదారుల సమాచారం అక్రమపద్దతుల్లో బయటికి వెళ్తే కఠిన చర్యలు తప్పవంటూ భారత ప్రభుత్వం హెచ్చరికలు పంపింది. దీనిపై కూడా జూబర్క్ స్పందించారు. త్వరలో భారత్ తో పాటుగా బ్రెజిల్ దేశాల్లో ఎన్నికలు జరగనున్నందున అమెరికా తహా ఘటనలు ఆయా దేశాల్లో జరక్కుండా గట్టి చర్యలు తీసుకుంటున్నట్టు ఆయన చెప్పారు.
వినియోగదారులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని భద్రంగా ఉంచడం తమ కర్తవ్యమని ఇందులో జరిగే ఎటువంటి పొరపాట్లకయినా తాను వ్యక్తిగతంగా బాధ్యత వహిస్తానని జూబర్గ్ తన పోస్టులో పేర్కొన్నారు. అన్ని రకాల యాప్ లను పరిశీలిస్తామని అనుమానాస్పద యాప్ లపై ఆడిట్ నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు.
ఫేస్ బుక్ లో మరిన్ని మార్పులకు శ్రీకారం చుడుతున్నట్టు జూబర్గ్ వెళ్లడించారు. కొత్త ఫీచర్లను తీసుకుని రానున్నట్టు చెప్పారు. భద్రతా ప్రమాణాలను పెంచడంతో పాటుగా వినియోగదారులు సులువుగా ఉపయోగించుకునే వెసులుబాటు ఉండేవిధంగా తీర్చిదిద్దుతున్నట్టు ఆయన తెలిపారు.
ప్రపంచ వ్యాప్తంగా ఫేస్ బుక్ వినియోగదారుల్లో అనుమానాలు వ్యక్తం కావడంతో కొంతకాలంగా మౌనంగా ఉంటూ వచ్చిన జూబర్గ్ ఎట్టకేలకు స్పందించారు. వినియోగదారుల అనుమానాలను తీర్చడంతో పాటుగా వివిధ దేశాల నుండి వస్తున్న హెచ్చరికలను దృష్టిలె పెట్టుకుని ఆయన తన ప్రతిస్పందనను పోస్ట్ ద్వారా వెల్లడించారు.
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది పేస్ బుక్ ను ఉపయోగిస్తున్నారు. సాజికమాధ్యమాల్లో ఇప్పటివరకు ఎదురులేకండా పోయిన ఈ సామాజిక మాధ్యమ దిగ్గజానికి ఇటీవల కాలంలోనే ఇంస్టాగ్రాం నుండి తీవ్రమైన పోటీ నెలకొంది. ఇటువంటి సమయంలో వ్యక్తిగత సమాచార దుర్వినియోగం తీవ్ర దుమారాన్ని రేపుతోంది.
భారత్ కూడా దీనిపై తీవ్ర అభ్యంతరాన్ని ఇప్పటికే వ్యక్తం చేసింది. అవసరమైతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికులు చేసింది. ఫేస్ బుక్ ను అత్యధికంగా వినియోగిస్తున్న దేశాల్లో భారత్ ఒకటి.
Facebook, mark zuckerberg,