తెలంగాణాలో ఈవీఎంల ట్యాంపరింగ్-విపక్షాల అనుమానాలు

0
75

ఎలక్ట్రానికి ఓటింగ్ మిషన్ (ఈవీఎం) ల పనితీరుపై ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో ముదరగా ఇటు తెలంగాణలోనూ వీటి పనితీరుతో పాటుగా ఎన్నికల సంఘం వ్యవహార శైలిపై విమర్శలు రేగుతున్నాయి. తెలంగాణ లో లోక్ సభ ఎన్నికలు ఈనెల 11వ తేదీన ముగిసినప్పటికీ ఈవీఎం ల పై, ఎన్నికల సంఘం పనితీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తూ వివిధ రాజకీయ పార్టీలు ఆరోపణలు చేస్తున్నాయి. తెలంగాణలో ఎన్నికల సంఘం సాయంత్రానికి ప్రకటించిన ఓటింగ్ శాతానికి తరువాతి రోజు ప్రకటించిన ఓటింగ్ శాతానికి మధ్య భారీగా తేడాలు ఉండడంపై కాంగ్రెస్, బీజేపీ పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.
ఓటింగ్ శాతం హఠాత్తుగా పెరిగిపోవడానికి కారణాలను ఎన్నికల సంఘం వివరించాలని ఆయా రాజకీయ పార్టీలతో పాటుగా ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. ఇదే విషయంపై సికింద్రాబాద్ నుండి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి అందరికంటే ముందే ఎన్నికల అధికారిని కలిసి తన అభ్యంతరాలను వ్యక్తం చేయగా తాజాగా నిజామాబాద్ నుండి బీజేపీ తరపున పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి డీ. అరవింద్ కుమార్ కూడా ఇదే అనుమానాలు వ్యక్తం చేయడంతో పాటుగా ఈవీఎంలు భద్రపర్చిన స్టాంగ్ రూపం లకు తాను కూడా వ్యక్తిగతంగా తాళాలు వేసుకోవడానికి అనుమతిని ఇవ్వాలంటూ ఎన్నికల సంఘానికి లేఖరాజయం సంచలనం రేపింది.
ఎన్నికల సంఘం వ్యవహార శైలిపై తమకూ అనుమానాలు ఉన్నాయని వారు టీఆర్ఎస్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ కాంగ్రెస్ పార్టీ కూడా ఆరోపిస్తోంది. ఎన్నికల అధికారులు పోలింగ్ శాతాన్ని వెల్లడించిన తీరును చూస్తుంటే తమకు అనుమానం కలుగుతోందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. ముందుగా ప్రకటించిన ఓటింగ్ శాతానికి మరుసటి రోజు ప్రకటించిన ఓటింగ్ శాతానికి పొంతన లేకుండా ఉందని, సాయంత్రానికి అంత పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు కనిపించకున్నా భారీ స్థాయిలో సాయంత్రాని ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారంటూ ప్రకటించడాన్ని చూస్తుంటే ఎన్నికల సంఘం అధికారుల పై అనుమానాలు వస్తున్నయని వారు చెప్తున్నారు.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంలోనూ ఇదే విధంగా జరిగిందని పూర్తి స్థాయి ఓటింగ్ శాతాన్ని వెల్లడించేందుకు రెండు రోజుల సమయాన్ని ఎన్నికల సంఘం తీసుకుందనే విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. ప్రస్తుత కమ్యునికేషన్ వ్యవస్థ ఇంత ఆధునికంగా మారిన తరువాత కూడా ఎన్నికల సంఘం సమాచారాన్ని తెప్పించుకోవడంలో జరిగిన జాప్యాన్ని చూస్తుంటే వారు ఒక పార్టీని అనుకూలంగా వ్యవహరించారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని వారు చెప్తున్నారు.
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రాత్రకి రాత్రి కొన్ని నియోజకవర్గాల్లో భారీ ఎత్తున ఓటింగ్ శాతాల్లో తేడాలు వచ్చాయని ఒక పథకం ప్రకారం ఈవిధంగా జరిగిందని వారు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం కూడా అవే పరిస్థితులు పునరావృతం అవుతున్నాయని దీనతో తమకు మరిన్ని అనుమానాలు కలుగుతున్నాయని ఈవీఎంల భద్రతపై తమకు భయాలు ఉన్నాయని వారు చెప్తున్నారు. టీఆర్ఎస్ కు చెందిన చిన్న లీడర్ కూడా ఈవీఎం లు భద్రపర్చిన స్టాంగ్ రూంలో ఫొటోలు తీయించుకున్నాడంటే పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయనే విషయం తెలుస్తోందని ఆ పార్టీలు ఆరోపిస్తున్నాయి. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నా కూటా తాము లోక్ సభ ఎన్నికల్లో 16 స్థానాలు గెల్చితీరతామంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడం కూడా తమ అనుమానాలకు బలం చేకూరుతోందని వారు పేర్కొన్నారు.

Wanna Share it with loved ones?