భారీ ఎన్ కౌంటర్ 7గురు మావోలు హతం

మహారాష్ట్రలో జరిగిన భారీ ఎన్ కౌంటర్ లో ఏడుగురు మావోయిస్టులు చనిపోయారు. చనిపోయినవారిలో ఐదుగురు మహిళలు ఉన్నట్టు సమాచారం. మావోలకు గట్టిపట్టున గడ్ఛిరోలి జిల్లాలో ఈ ఘటన జరిగింది. జిల్లాలోని పల్లేడ్ అటవీ ప్రాంతంలో గాలింపు జరుపుతున్న పోలీసులకు మావోయిస్టులు ఎదురు పడడంతో ఇద్దరికి మధ్య కాల్పులు మొదలయ్యాయని కాల్పులు ఆగిపోయిన తరువాత చూస్తే ఏడుగురు మావోయిస్టుల మృతదేహాలు కనపించినట్టు పోలీసులు తెలిపారు. చనిపోయిన వారిలో ఐదురు మహిళా మావోయిస్టులు ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. చనిపోయిన వారికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని వారు పేర్కొన్నారు.
మహారాష్ట్రోలని గడ్చిరోలి జిల్లా మావోయిస్టులకు కంచుకోటగా ఉంది. ఇక్కడికి పోలీసులు దళాలు కూబింగ్ జరపడమే అరుదు. పక్క ప్రణాళికతో వచ్చిన పోలీసులకు నక్సలైట్లకు భారీగా ఎదురు కాల్పులు జరిగాయి. ఇరు వైపుల నుండి పెద్ద ఎత్తున కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది.