కాశ్మీర్ లో భారీ ఎన్ కౌంటర్

0
76
జమ్ము కాశ్మీర్ లో జరిగిన భారీ ఎన్ కౌంటర్ లో పది మంది మృతి
encounter in jammu and kashmir

కాశ్మీర్ లో జరిగిన భారీ ఎన్ కౌంటర్ లో ఐదురుగు ఉగ్రవాదులతో పాటుగా పదిమంది చనిపోయారు. షోపియాన్ జిల్లాలో చోటుచేసుకున్న భారీ ఎదురు కాల్పుల్లో నిషేధిక హిజ్బుల్ ముజాహిదీన్ కు చెందిన ఐదురు తీవ్రవాదులను భద్రతా బలగాలు మట్టుపెట్టాయి. ఎన్ కౌంటర్ జరిగిన ప్రాంతంలో స్థానికులు భద్రతా బలగాలపై రాళ్లు రువ్వి వారితో ఘర్షణకు దిగారు. ఈ క్రమంలో భద్రతా బలగాలు ఆత్మరక్షణ కోసం జరిపిన కాల్పుల్లో ఐదుగురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు.
ఎన్ కౌంటర్ లో మరణించినవారిలో హిజ్బులు ముజాహిదీన్ కమాండర్ గా చెప్పుకుంటున్న సద్దాం పాడర్, కాశ్మీర్ విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ఫ్రొఫెసర్ గా పనిచేస్తూ ఉగ్రవాదిగా మారిన మహ్మద్ రఫి భట్ ఉన్నారు. ఉగ్రవాదులు సమావేశం అయ్యాయరనే సమాచారంతో అక్కడికి చేరుకున్న భద్రతాబలగాలు ముందుగా వారిని లొంగిపోవాల్సిందిగా కోరాయని అందుకు ప్రతిగా వారు కాల్పులు జరపడంతో భద్రతా బలగాలు జరిపిన ఎదురుకాల్పుల్లో ఉగ్రవాదులు హతమైనట్టు సైనికాధికారులు వెల్లడించారు.
కాల్పుల ధాటికి ముష్కరమూకలు దాక్కుని ఉన్న ఇల్లుకూడా పూర్తిగా ద్వంసం అయింది. ఎన్ కౌంటర్ పూర్తయినతరువాత భద్రతా బలగాలకు ఆ ప్రాంతం నుండి పెద్ద ఎత్తున ఆయుధాలు మందుగుండు సామాగ్రి లభించింది. పక్కా సమాచారంతోనే తమ బలగాలు తివ్రవాదులు ఉంటున్న ప్రాంతాన్ని గుర్తించి దాడిచేసినట్టు సైనిక అధికారులు వెల్లడించారు.
కాల్పులు జరుగుతున్న సమయంలోనే పెద్ద ఎత్తున స్థానికులు సైనికులపైకి రాళ్లు రువ్వడం ప్రారంభించారని వారిని ఎన్ని సార్లు సముదాయించినా పరిస్థితిలో మార్పు రాకోపవడంతో పాటుగా ఆత్మరక్షణకు మాత్రమే వారిపైకి భద్రతా దళాలు కాల్పులు జరపాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఐదురు పౌరులు ప్రాణాలు కోల్పోవడం తమను కూడా బాధిస్తోందని అయితే పెద్ద ఎత్తున బలగాలపైకి రాళ్లు రువ్వడంతో పాటుగా దాటికి పాల్పుడుతుండడంతో కాల్పులు జరపడం మినహా భద్రతా దళాలకు గత్యంతం లేకపోయిందని వారు వివరించారు.
భద్రతా బలగాల చేతిలో హతమైన మహ్మద్ రఫి బట్ కాశ్మీర్ విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఇటీవలే అతను విశ్వవిద్యాలయం నుండి అదృశ్యం కాగా అతనిపై నిఘాపెట్టి భద్రతాబలగాలకు ఉగ్రవాదుల ఆయువుపట్టు దొరికింది. సోషయాలజీలో పీహెచ్ డీ కూడా పూర్తిచేసిన ఉన్నత విద్యావంతుడు భట్ ఉగ్రవాద కార్యకలాపాల పట్ల ఆకర్షితుడై అటువైపు వెళ్లినట్టు తెలుస్తోంది.
భట్ తండ్రి కూడా గతంలో ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్పంచుుకని తిరిగి వచ్చేయగా అతనిని సోదరుల వరసయ్యే మరో ఇద్దరు కూడా గతంలో ఎన్ కౌంటర్ లో చనిపోయారు. భట్ చనిపోవడంతో అతని గ్రామం చుందానాతో పాటుగా కాశ్మీర్ లోని పలు ప్రాంతాల్లో తీవ్ర ఉధ్రిక్తత వాతావరణం నెలకొంది. భట్ బౌతిక కాయంతో భారీ ఊరేగింపు నిర్వహించారు. ముందు జాగ్రత్త చర్యగా కాశ్మీర్ యూనివర్సిటీకీ సెలవలు ప్రకటించారు. పరీక్షలను కూడా వాయిదా వేశారు. పలు చోట్ల ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు.
భద్రతా దళాల కాల్పుల్లో సామాన్య పౌరులు మరణించడం పట్ల జమ్ము కాశ్మీర్ ముఖ్యమంత్రి మహబూబా మఫ్తీ ఆందోళన వ్యక్తం చేశారు. ఇటువంటి ఘటనలు జరగడం దురదృష్టకరమని ఆమె అన్నారు.
jammu, jammu and kashmr, kashmir, kashmir encounter, sri nagar, kashmir university, jammu and kashmi university, jammu and kashmir cm, encounter in jammu and kashmir.

అకాల వర్షాలు కురుస్తాయి-వాతావరణ శాఖ హెచ్చరిక


ntv
Jammu_and_Kashmir
Line_of_Control
_(princely_state)

Wanna Share it with loved ones?