పెన్ష్ న్ విధానంపై బగ్గు మంటున్న ఉద్యోగులు

కొత్త పెన్షన్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలనే డిమాండ్ తో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు నిరసన ప్రదర్శనలకు దిగారు. కొత్త పెన్షన్ విధానం సీపీఎస్ ను వెంటనే రద్దు చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం అమలు చేస్తున్న పెన్షన్ విధానం వల్ల ఉద్యోగులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోందని ఉద్యోగులు చెప్తున్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ విధానం పై నిర్ణయం తీసుకుంటామని చెప్పిన టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత కూడా కొత్త పెన్షన్ విధానాన్నో కొనసాగిస్తూ వస్తోందని ఉద్యోగులు అంటున్నారు. కొత్త పెన్ష్ న్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలనే డిమాండ్ తో ఒక రోజు సామూహిక సెలవు పెట్టిన ఉద్యోగులు మండల, జిల్లా కేంద్రాల్లో ఆందోళనకు దిగారు. కలెక్టర్ కార్యాలయాల వద్ద ఉద్యోగులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ప్రభుత్వం వెంటనే పెన్ష్ న్ విధానంపై నిర్ణయం తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ వైఖరి మారని పక్షంలో ఆందోళన కార్యక్రమాలను మరింత ఉధృతం చేస్తామని ఉద్యోగ సంఘాలు హెచ్చరిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *