Skip to content
Tuesday, April 20, 2021
Telangana Headlines
News Unlimited
Search
Search
Home
Telangana
Andhra Pradesh
National
General
THL Special
Spiritual
Other
Home
Uncategorized
Elementor #8062
Uncategorized
Elementor #8062
April 5, 2020
THL
Post navigation
బ్రాహ్మణుల అభివృద్ధికి పెద్ద పీట : రమణా చారి తెలంగాణ ప్రభుత్వం బ్రాహ్మణుల అభివృద్ధికి పెద్ద పీట వేస్తుందని తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని సద్వినియోగం చేసుకోవాలని బడంగ్‌పేట మున్సిపాలిటీ పరిధిలోని కాశీ బుగ్గ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో రాష్ట్ర ప్రభుత్వ సలహదారులు రమణా చారి అన్నారు. దేవాలయంలో శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీ దేవనాథ రామానుజ జీయర్ స్వామి చేతుల మీదగా వికారి నామ సంవత్సరం పంచాంగంను, నూతన సంవత్సర క్యాలండర్ ను ఆవిష్కరించారు. తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు చక్రవర్తుల జగన్మోహన్ చార్యులు ఈ సభకు అధ్యక్షత వహించారు. ఉగాది సందర్భంగా కవితా గోష్టి కార్యక్రమంలో కవులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా రమణా చారి మాట్లాడుతూ బ్రాహ్మణులు రాజకీయంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందవలసిన అవసరం ఉందని మంచి చేస్తున్న వారికి చేయుతనివ్వాలన్నారు. శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీ దేవనాథ రామానుజ జీయర్ స్వామి మాట్లాడుతూ.. దేవుడు ఎవరికి అన్యాయం చేయరని అన్నారు. ప్రజల మద్య పరస్పర సహకారం ఉండాలన్నారు. భగవంతుని దృష్టిలో అందరు సమానం అన్నారు. సమాజ మార్పు కోసం అందరు పనిచేయాలన్నారు. ప్రతి ఒక్కరికి సేవా దృక్పథం ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సేవా సంఘం నాయకులు పాల్గొన్నారు.
వీక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు