విద్యావిధానంలో నూతన ఒరవడి ఎడ్యూవెకేషన్

0
81
eduvacation

eduvacation భారతదేశ విద్యావిధానంలో మార్పులు రావాల్సిన అవసరం ఉందని, శ్రీ రామానుజ మిషన్ ట్రస్ట్ చేపట్టిన “ఎడ్యూవెకేషన్” లాంటి కార్యక్రమాలు ఇందుకు దోహదపడతాయని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. విద్యార్థులు సెలవు దినాల్లో విద్యాను అభ్యసించడంతో పాటుగా విద్యాభ్యాసం సెలవులను ఆస్వాదించినట్టు సాగాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని రూపొందించామని, ప్రభుత్వం నిర్దేశించిన పాఠ్యప్రణాళికతో పాటుగా “ఎడ్యూవెకేషన్” రూపొందించిన కార్యక్రమాలను అమలు చేయడం ద్వారా అధ్బుతాలను సృష్టించవచ్చని వారు చెప్పారు. “ఎడ్యూవెకేషన్ వివరాలను సంస్థ ప్రతినిధులు, సలహాదారులు బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో జరిగిన సమావేశంలో మీడియాకు వివరించారు.
మానవ అభివృద్ధి సూచీలో భారత్ 158వ స్థానంలో ఉండడంపై ప్రణాళిక సంఘం మాజీ సభ్యుడు, జేఎన్టీయూ మాజీ వైస్ ఛాన్స్ లర్ డాక్టర్ స్వామినాథన్ ఆందోళన వ్యక్తం చేశారు. సూడాన్ లాంటి వెనకబడిన దేశాలు కూడా మనకన్నా మెరుగైన స్థానంలో ఉన్నాయని అన్నారు. విద్యావ్యవస్థలో మార్పులతో పాటుగా దానిపై ప్రభుత్వాలు దృష్టిపెట్టాల్సిన అవసరాన్ని ఇది సూచిస్తుందన్నారు. విద్యా,ఆరోగ్యం,ఉద్యోగ అవకాశాలు, రాజకీయ,ఆర్థిక స్వేచ్ఛ లాంటి అంశాలను దృష్టిలోపెట్టుకుని మానవవనరుల అభివృద్ది సూచిని విడుదల చేస్తారని ఇందులో భారత్ వెనకబడి ఉండడం బాధను కలిగిస్తోందన్నారు. “ఎడ్యూవెకేషన్” లాంటి కార్యక్రమాల ద్వారా విద్యావ్యవస్థలో మార్పులకోసం శ్రీ రామానుజ మిషన్ ట్రస్ట్ చేస్తున్న ప్రయత్నాన్ని ఆయన అభినందించారు. విద్యార్థులను అన్ని అంశాల్లో ఉన్నతులుగా తీర్చిదిద్దడమే ఈ కార్యక్రమ లక్ష్యమని ఆయన చెప్పారు. భారత దేశంలోని విద్యార్థులు ప్రపంచంలోని ఎవరికీ తీసిపోరని అయితే వారిని సరైన దిశలో నడిపించాల్సిన బాధ్యత విద్యాసంస్థలు, తల్లిదండ్రులపై ఉందన్నారు. ఎడ్యూవెకేషన్ కేవలం విద్యార్థులకు మాత్రమే పరిమితం కాకుండా ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు కూడా శిక్షణ ఇవ్వడం ద్వారా విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడినట్టవుతుందన్నారు.
ప్రస్తుతం విద్యావ్యవస్థ సంక్షోభంలో ఉందని, విద్యార్థులకు సరైన దిశా నిర్దేశం కరువవుతోందని ఉస్మానియా విశ్వవిధ్యాలయం సెంటర్ ఫర్ ప్లాంట్ మాలిక్యూలర్ బయాలజీ మాజీ డైరెక్టర్ ఫ్రొఫెసర్, డాక్టర్ వూడెం దశావంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం విద్యార్థుల మెదళ్లలోకి సమాచారం నింపడం మాత్రమే జరుగుతోందని అది సరైంది కాదని ఆయన అన్నారు. విద్యార్థులు తమకు ఇష్టమైన రంగాల్లో ప్రతిభను చాటేలా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని దీనికి తగినట్టుగా పాణ్యప్రణాళికలను రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. నానాటికీ విద్యాప్రమాణాలు సన్నగిల్లుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం అమలవుతున్న బోధనా పద్దతుల్లో మార్పులు రావాల్సిన ఉందన్నారు.
ధన్వంతరీ ఫౌండేషన్ ఫౌండర్ ట్రష్టీ డాక్టర్ పి. కమలాకర శర్మ మాట్లాడుతూ ప్రస్తుతం ప్రపంచం మొత్తం కృతిమ మేథస్సు చుట్టు తిరుగుతోందని దానికి ధీటుగా సూపర్ నేచురల్ ఇంటలిజెన్స్ ను అభివృద్ది చేసే క్రమంలోనే ఎడ్యూవెకేషన్ కార్యక్రమాన్ని చేపట్టినట్టు తెలిపారు. ఇది విద్యారంగంలో వినూత్న విధానమని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత సమాజంలో సాంకేతికత పెరిగింది కానీ మానవ విలువలు తగ్గిపోతున్నాయని అన్నారు. సాంకేతికత మోజులు పడి కొట్టుకుపోతున్నారని ఇది మంచి పరిణామం కాదన్నారు. విద్యార్థులకు సరైన గమ్యం లేకుండా పోతోందని వారిని సరైన దారిలో పెట్టేందుకు, వారిలోని ప్రతిభా పాటవాలను వెలికితీసేందుకు ఎడ్యువెకేషన్ కార్యక్రమం ఉపయోగపడుతుందని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా పెరెన్నికగన్న మేధావులు, శాస్త్రవేత్తలు ఈ కార్యక్రమంలో భాగం పంచుకుంటున్నారని ఆయన వివరించారు. ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా అమలు చేయడానికి వీలుగా ఈ పాఠ్యప్రణాళికను రూపొందించినట్టు ఆయన వివరించారు.
ఎడ్యూవెకేషన్ విద్యార్థులకోసం రూపొందించిన వినూత్న కార్యక్రమమని సంస్థ ప్రతినిధి ఐశ్వర్య తెలిపారు. ఈ కార్యక్రమం అద్భుతాలు సృష్టిస్తోందని ఆమె వివరించారు. తమిళనాడులోని పాఠశాలల్లో దీన్ని అమలు చేస్తున్నామని అక్కడి విద్యార్థులు అధ్వితీయ ప్రతిభను కనబరుస్తున్నారన్నారు. యువజనుల శక్తి అపారంగా ఉన్న భారత్ లోని మానవవనరులను సక్రమంగా వినియోగించుకోగలిగితే భారత్ పురుగమనానికి తిరుగే ఉండదన్నారు. ఎడ్యూవెకేషన్ అన్ని వర్గాల కోసం ఉద్దేశించిందని ఇందులో పేద ధనిక తారతమ్యాలు లేవన్నారు. ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఈ కార్యక్రమాన్ని చెపట్టినట్టు ఆమె వివరించారు.
విద్యార్థులు పరీక్షలకోసం బట్టీపట్టి చదువుతున్నారని తాను చదివింది రెండు సంవత్సరాల తరువాత వారికి గుర్తుకూడా ఉండడంలేదని సంస్థ ప్రతినిధి ఎస్.చంద్రశేఖర్ అన్నారు. ఇటువంటి విధానానికి స్వస్తిచెప్పడానికే ఎడ్యూవెకేషన్ కార్యక్రమాన్ని రూపొందించినట్టు ఆయన వివరించారు. చదువుతో పాటుగా వ్యక్తిత్వాన్ని పెంపొందించే విధంగా తమ కార్యక్రమాన్ని రూపకల్పన చేసినట్టు ఆయన తెలిపారు. ప్రస్తుత సమాజంలో అవసరం అయిన 64 కళలపై విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. తమ పాఠ్య ప్రణాళికలో విలువలకు పెద్దపీట వేస్తున్నామన్నారు.

eduvacation, eduvacation programme.
వీటికి ఆధార్ కార్డు తప్పని సరి
eduvacation

Wanna Share it with loved ones?