సరిగా చదివినా చదవక పోయినా పై తరగతులకు పంపించే ప్రస్తుత విధానానికి కేంద్ర ప్రభుత్వం కోత విధిస్తోంది. ప్రస్తుతం ఉత్తీర్ణతతో సంబంభం లేకుండా ఎనిమిదవ తరగతి వరకు విద్యార్థులు నో డిటెన్షన్ పద్దతి ప్రకారం పై తరగతులకు వెళ్ళేవారు. అయితే ఈ విధానంలో కోత విధించాలని భావించిన కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంటోంది. ప్రస్తుతం ఉన్న నిబంధనలు మార్చి ఊత్తీర్ణత కాకున్నా పై తరగతులకు పంపే విధానం 5వ తరగతి వరకే అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనితో 5వ తరగతి తరువాత విద్యార్థులు పరీక్షల్లో పాస్ అయితేనే పై తరగతులకు పంపిస్తారు. ఫేయిల్ అయితే తిరిగి అదే తరగతిలో కొనసాగిస్తారు. విద్యా వ్యవస్థలో మార్పులతో పాటుగా నాణ్యతను పెంచే చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 5వ తరగతి తరువాత కూడా పై తరగతికి పంపే విధానం వల్ల నిద్యావిధానంలో నాణ్యత లోపిస్తోందని 9వ తరగతికి వచ్చిన విద్యార్థులు 9,10 సరిగా చదవలేకపోవడంతో తో పాటుగా 10వ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణీతా శాతం తగ్గిపోవడం వంటి కారణాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.