ఉత్తరాదిన దుమ్ము తుపాను 100 మంది మృతి

ఉత్తరభారత దేశాన్ని అకాల వర్షాలు , గాలివన వాన అతలాకులం చేస్తున్నాయి. ఇప్పటివరకు దుమ్ము తుపాను ధాటికి 100 మంది దాకా మరణించినట్టు వార్తలొస్తున్నాయి. ప్రకృతి విపత్తు వల్ల అనేక మందికి గాయాలయ్యాయి. 250 మందికి పైగా గాయపడ్డట్టు తెలుస్తోంది. బలమైన ఈదురుగాలులతో పాటుగా దుమ్ము తుపాను ఉత్తరాది రాష్ట్రాలను వణికిస్తోంది. ఒక్కసారిగా ఎగిసిపడుతున్న దుమ్ము, దానికి తోడు ఈదురు గాలులు ప్రజలను వణికిస్తున్నాయి. ఉత్తర్ ప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్, హర్యానా, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు ప్రకృతి విలయానికి చిరుగుటాకులా వణికిపోతున్నాయి. భారీ ఈదురుగాలులకు పెద్ద చెట్లు కూకటివేళ్లతో సహా కూలిపోతున్నాయి, విద్యుత్ స్థంబాలు విరిగిపడ్డాయి. నగరాల్లో హోర్డింగ్ లు కూలిపోయాయి. గాలి దుమారానికి ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. ఈ ప్రకృతి విపత్తు వల్ల భారీగా ప్రాణనష్టంతో పాటుగా ఆస్తి నష్టం కూడా జరిగింది.
మెరుపులు, ఉరుములతో ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ప్రధానంగా ఉత్తర్ ప్రదేశ్ లోని ఉత్తర ప్రాంతాల్లో ప్రభావం ఎక్కువగా ఉంది. నాలుగు జిల్లాల్లో బలమైన గాలులు వీస్తున్నాయి. భారీ వర్షాలు కురుస్తున్నాయి, దుమ్ము ఎగిసిపడుతోంది. ఆగ్రాలోనే 43 మంది మరణించినట్టు ఆధికారులు చెప్తున్నారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాసం ఉన్నట్టు అనధికారవర్గాల సమాచారం. ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం సహాయక కార్యక్రమాలను ముమ్మరం చేసింది. వెంటనే రంగంలోకి దిగిన సహాయక బృందాలు పడిపోయిన చెట్లను, విద్యుత్ స్థంబాలను తొలగించే పనిలో నిమగ్నమయ్యాయి. విద్యుత్ సరఫరాను పునరుద్దరించేందుకు చర్యలు తీసుకుంటున్నప్పటికీ సహాయక బృందాలకు వాతావరణం సహకరించడం లేదు. మరో రెండు రోజుల పాటు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
అటు ఉత్తరాఖండ్ లోనూ భారీ వర్షాలు పడుతున్నాయి. వీటికారణంగా ఛార్ ధామ్ యాత్రను తాత్కాలికంగా ఆటంకం ఏర్పడింది. కొన్నిచోట్ల కొండచరియలు విరిగిపడడంతో రోడ్డు మార్గంలో ప్రయాణానికి ఆటకం ఏర్పడింది. రోడ్డు మార్గాన్ని తిరిగి తెరిచే పనిలో సహాయక బృందాలు ముమ్మరంగా పనిచేస్తున్నాయి. దేశరాజధాని ఢిల్లీలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈదురు గాలులకు అనేక ప్రాంతాల్లో చెట్లు కూలిపోయాయి. రోడ్లపై భారీగా నీరు నిల్చిపోవడంతో పలు చోట్ల ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
పంజాబ్ హర్యానాల్లోనూ ఇదే పరిస్థితి. భారీ వర్షాలు, ఈదురుగాలులకు ఈ రెండు రాష్ట్రాల్లోనూ ప్రజలు నానా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. అయితే అదృష్టవశాత్తు ఈ రెండు రాష్ట్రాల్లో ఎటువంటి ప్రాణనష్టం జరిగినట్టు వార్తలు రాలేదు. అటు మధ్యప్రదేశ్ లోని పలు చోట్ల భారీగా వర్షాలు పడుతున్నాయి.
రాజస్థాన్ లో దుమ్ము తుపాను తీవ్ర ఇబ్బందులు పెడుతోంది. ఉత్తర్ ప్రదేశ్ తరువాత ఇక్కడే ప్రాణనష్టం ఎక్కువగా ఉంది. దుమ్ము తుపాను సృష్టించిన భీబత్సానికి రాష్ట్రంలోని భరత్ పూర్ జిల్లాలో 16 మంది, ధోల్ పూర్ జిల్లాలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. అల్వార్లో నలుగురు, ఝున్‌ఝున్‌, బికనేర్‌లలో ఒక్కొక్కరు మృతి చెందారు. గాలివాన వల్ల ఇళ్లు కూలిపోవడంతో ప్రాణనష్టం ఎక్కువగా జరిగింది.
సహజంగా ఎండలు ఎక్కువగా ఉండే ఈ సమయంలో ఉత్తర భారతదేశంలో ఒక్కసారిగా విరుచుకని పడిన తుపాను తీవ్ర భీబత్సాన్నే సృష్టించింది.
north india, dust storm , Many parts of Punjab also hit by a high-velocity dust ,As per the latest figures, the death toll in Uttar Pradesh has reached 64,Several houses and electricity polls collapsed. dust storm in north india

హైదరాబాద్ లో భారీ వర్షం | Heavy rain in hyderabad