తీరిన సొంత ఇంటి కల

ఆదర్శగ్రామాల్లో డబుల్ బెడ్ రూం ఇళ్లు పేదల పరం అయ్యాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత గ్రామాలు సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లి, నర్సన్నపేట  గ్రామాల్లో పేదలకు నిర్మించి ఇచ్చిన డబుల్ బెడ్ రూం ఇళ్లను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. ఎర్రవల్లి ఏర్పాటుచేసిన పైలాన్ ను కేసీఆర్ ఆవిష్కరించారు. ఇక్కడే నిర్మించిన సామాజిక భవనాన్ని కూడా సీఎం ప్రారంభించారు. ఎర్రవల్లిలో 330, నర్సన్నపేటలో 159 గృహాల్లో సామూహికంగా గృహప్రవేశాలు జరిగాయి. 2015 దసరా రోజున శంఖుస్థాపన జరగ్గా రికార్డు స్థాయిలో 14 నెలల్లోనే ఈ గృహాల నిర్మాణం పూర్తయింది. వాస్తు పూజను నిర్వహించిన తరువాత లబ్దిదారులు గృహప్రవేశం చేశారు. ఇక్కడ నిర్వహించిన వాస్తుహోమ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్నారు. అన్ని హంగుల, సకల సైకర్యాలతో ఇళ్ల నిర్మాణం జరిగింది. లబ్దిదారులకు ఇళ్లతో పాటుగా పాడి గేదెలు, కోళ్లను కూడా అందచేశారు. ఈ ఆదర్శ గ్రామాల్లోని ఇళ్లను అన్ని హంగులతో సౌకర్యవంతంగా నిర్మించారు.
ఈ రెండు గ్రామాలను నగదు రహిత గ్రామాలుగా తీర్చిదిద్దారు.
doublebedrooms023
 

  •   ఒక్కొక్క ఇల్లు 560 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణం.
  • మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి తాగునీరు
  • 600 పేద కుటుంబాలకు ఉచితంగా డబుల్ బెడ్‌రూం ఇండ్లు.
  • వెయ్యి మందికి సరిపడా కల్యాణ మండపం, భోజనశాల నిర్మాణం.
  • హరితహారం కింద ప్రతి ఇంటికి ఐదు మొక్కల పంపిణీ. పచ్చదనం శోభతో వెల్లివిరిసేలా రహదారులకు ఇరువైపులా మొక్కలు.
  • జలసంరక్షణ కోసం ఇంటింటా ఇంకుడు గుంతల నిర్మాణం. అందుబాటులో ఇంటర్నెట్ సేవలు
  • రెండు గ్రామాల రైతులు స్ఫూర్తిమంతంగా 2800 ఎకరాల్లో సామూహిక పంట సాగు. విత్తనోత్పత్తి కింద సోయాబిన్ అధిక దిగుబడి.
  • సమీకృత బిందు సేద్యం కింద 2 గ్రామాల్లో నెటాఫిమ్ కంపెనీ ద్వారా 2800 ఎకరాల్లో 1400 మంది రైతులకు పరికరాలు.
  • మిషన్ కాకతీయ కింద ప్రత్యేక ప్రణాళికతో ఈ రెండు గ్రామాల్లో ఐదు చెరువులు, కుడ్లేరు వాగుపై చెక్‌డ్యాంల నిర్మాణంతో సమృద్ధిగా నీటి నిల్వకు అవకాశం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *