గాడిదపాల చీజ్ చాలా కాస్ట్ లీ…

0
78

ఒక పౌండ్ చీజ్ ఖరీదు ఎంత ఉంటుంది. మహా అయితే వందల్లో ఉంటుందని అనుకుంటున్నారా అయితే మీరు పప్పులో కాలేసినట్టే. ఒక పౌండ్ చీజ్ ధర అచ్చంగా వేయి డాలర్లు అంటే దాదాపు 65 వేల రూపాయలు. అవునండి ఇది నిజ్జంగా నిజమే. ఇంతకీ పౌండ్ అంటే ఎంతో తెలుసు కదా 435 గ్రాములు అంటే అర కిలో కన్నా తక్కువ. మరి చీజ్ ఇంత ధర పలకడానికి కారణం ఏమై ఉంటుందా అని ఆలోచిస్తున్నారా… ఈ చీజ్ ను మేలు జాతి గాడిదల పాల నుండి తయారు చేస్తారట. మీరు విన్నది నిజమే ఈ చీజ్ గాడిద పాల నుండి తయారవుతుంది. అయితే అవి సాధారణ గాడిదలు కావు అరుదైన మేలు జాతి గాడిదలు. చాలా అరుదుగా ఉండే బాల్కన్ జాతికి చెందిన గాడిదల పాల నుండి తయారయిన చీజ్ కనుకనే ఇది అంత ధర పలుకుతోంది. ఈ అరుదైన చీజ్ ను సేర్బియాలోని జసావిక ఫాంహౌస్ లో మాత్రమే తరయారు చేస్తారు. బాల్కన్ జాతికి చెందిన గాడిదలు చాలా తక్కువ మొత్తంలో పాలను ఇస్తాయి. ఒక పౌండ్ చీజ్ ను తయారు చేయడానికి దాదాపుగా 3.7 లీటర్ల పాలు అవసరం అవుతాయట. దాదాపు 15 గాడిదల నుండి పాలు పితికితేగాని ఇన్ని పాలు రావు. దీనితో పాటుగా బాల్కన్ జాతి గాడిదల పోషణ కూడా చాలా కష్టం అందుకే అరకిలోకన్నా తక్కువ ఉండే చీజ్ ధర 65 వేలరూపాయలు పలుకుతుంది. గాడిదల పాల నుండి తయారయిన చీజ్ లో చాలా పోషకాలు ఉన్నాయని ఇవి ఆరోగ్యానికి చాలా మంచిదని ప్రజల నమ్మకం. అందుకే ఎంత ధర పెట్టి అయినా ఈ చీజ్ ను కొనుక్కోవడానికి జనాలు పోటీ పడుతున్నారు. ఇంత ధర పలికినా ఈ చీజ్ ను కొనుక్కోవడానికి రోజుల తరబడి వేచిఉండక తప్పదట… గాడిదపాలు కడివెడు అయినా దండగ అన్న వేమన శతకారుడి మాటలు సెర్బియా వాసులకు మాత్రం పట్టడం లేదు. అన్నట్టు ఈ చీజ్ కేవలం సెర్బియానే కాదండీ యూరప్ మెత్తానికి ఎగుమతి అవుతుందట…

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here