రక్షణ శాఖ కు అరకొర కేటాయింపులు

0
69

పొరుగుదేశం చైనా తన రక్షణ కేటాయింపులు సంవత్సరానికి సంవత్సరానికి పెంచుకుంటూ ఆధునిక ఆయుధాలను సముపార్జించుకుంటున్న సమయంలో భారత్ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. చైనాతో పాటుగా దాయాది దేశం పాకిస్థాన్ కూడా తన రక్షణ కేటాయింపులు భారీగా పెంచుకుంటూ పోతోంది. చైనా నుండి పెద్ద ఎత్తున ఆయుధాలను కొనుగోలు చేస్తున్నప్పటికీ భారత్ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. రక్షణ శాఖకు ఆర్థిక వనరుల కేటాయింపులో జరుగుతున్న నిర్లక్ష్యాన్ని రక్షణ శాఖకు జరుగుతున్న కేటాయింపులపై ఏర్పాటయిన పార్లమెంటరీ స్థాయి సంఘం కూడా తీవ్రంగా ఆక్షేపించింది.
ఆధునిక ఆయుధాల కోసం రక్షణ శాఖ కోరిన నిధుల్లో కనీసం సగం కూడా ఆర్థిక శాఖ మంజూరు చేయని పరిస్థితి. ఆయుధాలు ఇతరత్రా అవసరాల కోసం 1.72 లక్షల కోట్లను రక్షణ శాఖ కోరగా ఆర్థిక శాఖ మాత్రం 93వేల కోట్ల రూపాయలను మాత్రమే మంజూరు చేసింది. దీనితో ఇప్పటికే కొనుగోలు చేసిన ఆయుధాలకు చెల్లింపులు చేయడం మినహా కొత్త తరహా ఆయుధాలను కొనే పరిస్థితి కనిపించడంలేదనేది రక్షణ శాఖ వర్గాల వాదన.
దేశ భద్రత విషయంలో ఎటువంటి రాజీలేదని పైకి చెప్తున్నా వాస్తవాలు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. భారత సైనిక యుద్ధ సన్నధ్దత పై గతంలోనూ అనేక వార్తలు వచ్చాయి. ప్రస్తుతం సైన్యం వద్ద ఉన్న ఆయుధాల్లో చాలా మటుకు కాలం చెల్లినవి ఉన్నాయని అత్యవసరంగా ఆధునిక ఆయుధాలను సమకూర్చుకోవాల్సిన ఆవస్యకత ఉందని చెప్పినా దానికి అనుగుణంగా చర్యలు మాత్రం కనిపించడం లేదు.
టీఆర్ఎస్ లోకి శ్రీధర్ బాబు?

Wanna Share it with loved ones?