పశ్చిమ బెంగాల్ లోని హౌరా జిల్లాలోని దూలాఘడ్ ప్రాంతం అల్లర్లతో అట్టుడుగుతోంది. డిసెంబర్ 12వ తేదీన మిలాద్ -ఉన్-నబీ సందర్భంగా చెలరేగిన అల్లర్లు ఇంకా చల్లారలేదు. ఈ ఘర్షణల్లో అనేక మంది గాయపడ్డారు, పెద్ద సంఖ్యలో ఇళ్లను లూటీచేశారు. వాహనాలను తగులబెట్టారు. ఒక వర్గం వారిని లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. అల్లర్లకు భయపడి పెద్ద సంఖ్యలో ప్రజలు కట్టుబట్టలతో సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. ఇంత జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. ఒక వైపు దూలాఘడ్ ప్రాంతం అల్లర్లతో అట్టుడుకుతున్నా దీనిపై అన్ని రాజకీయ పక్షాలు చలికాచుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఒకరిపై ఒకరు విమర్శలతో కాలం వెళ్ళబుచ్చుతున్నారు.
- డిసెంబర్ 12న మిలనాద్-ఉన్ -నబీ సందర్భంగా ఘర్షణలు మొదలయ్యాయి.
- గొడవలు మొదలై 10రోజులు దాటిపోయినా ఇంకా పరిస్థితి సాధారణ స్థితికి చేరలేదు
- గొడవల కారణంగా అనేక మంది కట్టుబట్టలతో ఇళ్లను వదిలి బయటికి రావాల్సిన పరిస్థితి తలెత్తింది.
- ఇళ్లదహనాలు, లూటీలు జరుగుతున్నట్టు సమాచారం.
- పరిస్థితి అదుపులోనే ఉందని పోలీసులు చెబుతున్నా అందులో వాస్తవం లేదంటున్న స్థానికులు
- బంధువుల ఇళ్లలో తలదాచుకుంటున్న బాధితులు
- పరస్పర ఆరోపణలతో కాలం వెళ్లదీస్తున్న రాజకీయ పక్షాలు
- అధికార పక్షం వల్లే ఘర్షణలంటూ విమర్శిస్తున్న కాంగ్రెస్ పార్టీ
- రాజకీయ నేతలను అల్లర్లు జరిగిన ప్రాంతంలోకి అనుమతించని పోలీసులు
- పుకార్లతో మరింత విషమిస్తున్న పరిస్థితి
- ఒక వర్గంపై భారీగా దాడులు జరుగుతున్నాయంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం
- పుకార్లను నమ్మవద్దంటున్న పోలీసులు
- పరిస్థితి అదుపులోనే ఉందంటున్న పోలీసులు
- ఎవరినీ వదిలేది లేదని హెచ్చరించిన పోలీసులు