సిర్సాలో మరోసారి అల్లర్లు-సైన్యం ఫ్లాగ్ మార్చ్

0
44

అత్యాచారం కేసులో డేరా సచ్చా సౌధా అధినేత గుర్మీత్ సింగ్ కు సీబీఐ ప్రత్యేక కోర్టు 10 సంవత్సరాలు జైలు శిక్ష విధించిన తరువాత గుర్మీత్ అనుచరులు మరోసారి విధ్వంసానికి పాల్పడ్డారు. పూల్కా ప్రాంతంలో రెచ్చి పోయిన డేరా బాబా అనుచరులు రెండు కార్లను తగలబెట్టడంతో పాటుగా ప్రైవేటు ఆస్తుల విధ్వంసానికి పూనుకున్నారు. అయితే భారీగా మోహరించి ఉన్న పోలీసు, మిలటరీ దళాలు వెంటనే రంగంలోకి దిగి ఆందోళనకారుల్ని అదుపులో పెట్టాయి. విధ్వంసానికి పాల్పడుతున్న వారిని పోలీసు బలగాలు చెదరగొట్టాయి. డేరా బాబాకు శిక్షను ఖరారు చేసిన వెంటనే రెచ్చిపోయిన బాబా అనుచరులు జరిగిపిన విధ్వంసకాండకు 38 మంది చనిపోగా వందల మందికి గాయాలయిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో పోలీసులు, సైనిక దళాలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నప్పటికీ అక్కడక్కడా హింసాత్మక ఘటనలు జరిగినట్టు వార్తలు వచ్చాయి. అయితే భద్రతా బలగాలు వాటిని ఎప్పటికప్పుడు అదుపు చేయగలుగుతున్నాయి.
హింసాత్మక ఘటనలకు కేంద్రంగా మారిన సిర్సాలో సైన్యాన్ని భారీ ఎత్తున మోహరించారు. సైన్యం పట్టణంలో ఫ్లాగ్ మార్చ నిర్వహించింది. మరో వైపు ఎటువంటి విధ్వంసాలకు దిగవద్దని డేరా సచ్చా సౌధా పిలుపునిచ్చింది.

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here