భారత రక్షణ శాఖ వెబ్ సైట్ హ్యాక్

భారత రక్షణ శాఖ వెబ్ సైట్ హ్యాక్ | Defence ministry website ‘hacked’

భారత రక్షణ శాఖ కు చెందిన అధికారిక వెబ్ సైట్ ను హ్యాక్ చేశారు. చైనా చెందిన వారు ఈ వెబ్ సైట్ ను హ్యాక్ చేసినట్టుగా అధికారులు అనుమానిస్తున్నారు. రక్షణ శాఖకు చెందిన ఈ వెబ్ సైట్ ను నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సంస్థ నిర్వహిస్తోంది. రక్షణ శాఖకు చెందిన వెబ్ సైట్ ను అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించినప్పటికీ దీన్ని కూడా హ్యాక్ చేయడంపై రక్షణ శాఖ అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
భారత రక్షణ శాఖ కు చెందిన వెబ్ సైట్ హ్యాక్ కు గురయిన విషయాన్ని అధికారులు దృవీకరిస్తున్నారు. దీన్ని తిరిగి ఆధీనంలోకి తీసుకుని రావడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు రక్షణ అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం వెబ్ సైట్ లో చైనీస్ అక్షరాలు కనిపిస్తున్నాయని వారు వెల్లడించారు. దీన్ని ఎవరు హ్యాక్ చేసిందనే దానిపై తమ వద్ద ప్రస్తుతం ఎలాంటి సమాచారం లేదని వారు చెప్తున్నారు.
భారత రక్షణ శాఖ కు చెందిన వెబ్ సైట్ ను హ్యాకర్ల నుండి తిరిగి తమ ఆధీనంలోకి తీసుకుని వచ్చేందుకు పూర్తి ప్రయత్నాలు చేస్తున్నామని దీనిపై నిపుణలు బృందం పనిచేస్తోందని వారు వెల్లడించారు. త్వరలోనే సైట్ ను తిరిగి పనిచేసే విధంగా తీర్చిదిద్దుతామని రక్షణ శాఖ ప్రతినిధి వెల్లడించారు. చైనాకు చెందిన హ్యాకర్లే ఈ చర్యకు పాల్పడి ఉంటారని మరో అధికారి పేర్కొన్నారు.
అధికారిక వెబ్ సైట్ హ్యాక్ గురయిన సమాచారం ఉన్నట్టు రక్షణ శాఖ మంత్రి నిర్మాలా సీతారామన్ తెలిపారు. సైట్ ను తిరిగి గాడిలో పెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆమె వివరించారు.
వెబ్ సైట్ లో అధికారిక సమాచారం మినహా రక్షణ రంగానికి చెందిన ఎటువంటి విలువైన సమాచారం లేదని అధికారిక వర్గాలు చెప్తున్నాయి. హ్యాక్ చేయడం ద్వారా వారికి రక్షణ రంగానికి చెందిన ఎటువంటి కీలక సమాచారం అందే అవకాశం లేదని అధికారులు స్పష్టం చేశారు. అయితే రక్షణ రంగానికి చెందిన వెబ్ సైట్ ను హ్యాక్ చేయడం ద్వారా హ్యాకర్లు సవాల్ విసిరినట్టయిందని రక్షణ రంగానికి చెందిన అధికారులు చెప్తున్నారు.
సైబర్ దాడులు పెరిగిపోతున్న నేపధ్యంలో మరింత పకడ్బందీగా సైట్ ను రూపొందిస్తామని ఆధికారులు స్పష్టం చేశారు. ఎటువంటి లోపాలు తలెత్తకుండా చూస్తామని చెప్పారు. హ్యాక్ గురయిన తరువాత ఎదైనా సమాచారాన్ని తొలగించారా…లేదా అనే విషయాన్ని ముందుగా గుర్తించాల్సి ఉంది.
కేంద్ర హోం మత్రిత్వశాఖతో పాటుగా కార్మిక, న్యాయశాఖలకు చెందిన వెబ్ సైట్ లు కూడా కొద్దిసేపు మెరాయించాయి. వీటిని కూడా హ్యాక్ చేసేందుకు ప్రయత్నించారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హ్యాకింగ్ అనుమానం వచ్చిన వెంటనే కీలక సమాచారాన్ని హ్యాకర్లకు చిక్కకుండా బ్లాక్ చేసినట్టు సాంకేతిక నిపుణుల బృందం స్పష్టం చేసింది.
Defence ministry, website ‘hacked, difference minister nirmala seetha raman said “appropriate action” had been initiated in the matter. She added that steps would be taken to “prevent any such eventuality in the future.” Chinese hackers may be involved in defacing the website said by difference official.


indian army
Indian_Armed_Forces
ndian_Army
Chief_of_the_Army_Staff_

Releated

సుష్మస్వరాజ్ కన్నుమూత

సుష్మాస్వరాజ్ కన్నుమూత…

బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ కన్నుమూశాలు. తీవ్ర గుండెపోటుతో ఆమె చనిపోయారు. 67 సంవత్సరాల సుష్మ గత కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. దీనివల్లే ఆమె పార్లమెంటు ఎన్నికల్లోనూ పోటీ చేయలేదు. సుష్మాకు మంగళవారం రాత్రి గుండెపోటు రావటంతో కుటుంబ సభ్యులు దిల్లీలోని ఎయిమ్స్‌ కు తరలించారు. ఆ వెంటనే ఎమర్జెన్సీ వార్డుకు మార్చారు. చికిత్స అందిస్తుండగానే ఆమె తుదిశ్వాస విడిచారు. ఆమెకు భర్త స్వరాజ్‌ కౌశల్‌, కుమార్తె బన్సురి […]

సుదర్శన యాగం

యాదాద్రిలో భారీ ఎత్తున సుదర్శన యాగం

యాదగిరి గుట్ట దేవాలయ పుననిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దేవాలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చేదిద్దేపనులు తుదిదశకు చేరుకుంటున్నాయి. ఈ క్రమంలోనే త్వరలోనే యాదాద్రిలో మహా సుదర్శన యాగం నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఈ యాగ నిర్వహణకు సంబంధించిన అంశాలను చర్చించేందుకు ముఖ్యమంత్రి శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామితో ముఖ్యమంత్రి చర్చించారు. యాదాద్రిలో వంద ఎకరాల యజ్ఞవాటికలో 1048 యజ్ఞ కుండాలతో యాగం నిర్వహించాలని నిర్ణయించారు. మూడు వేల మంది రుత్వికులు, మరో 3వేల […]