అక్కడ అన్నింటికీ కఠిన నిబంధనలే

సౌదీ ఆరేబియా ఇరవై లక్షలకు పైగా భారతీయులు నివసిస్తున్నారు. ఇందులో సగటున రోజుకు వివిధ కారణాల వల్ల ముగ్గురు నుండి నలుగురు చనిపోతున్నారని భారత విదేశీ మంత్రిత్వ శాఖ వెళ్లడించింది. సౌదీలో మరణిస్తున్నవారిలో ఎక్కువ శాతం మందివి సహజ మరణాలేనని పేర్కొంది. సహజంగా మరణించి, అన్ని పత్రాలు సక్రమంగా ఉన్న వారి మృతదేహాలను స్వదేశానికి తీసుకుని రావడం కోసం మూడు వారాలకు పైగానే పడుతుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి వికాస్ స్వరూప్ వెళ్ళడించారు. సహజ మరణాలకు కూడా మృతదేహాలను తరలించడం క్లిష్టంగానే ఉంటుంది. ఇక అసహ మరణాలు, ఆత్మహత్యలు, రోడ్డు ప్రమాదాల వంటి వాటిల్లో చనిపోయిన వారి మృతదేహాలను తరలించడం చాలా సంక్లిష్టమైన వ్యవహారం దీనికి చాలా సమయం పడుతుంది. కొన్ని సార్లు నెలల తరబడి వ్యవహారం సాగుతుంది. దీనితో సౌదీలో మృతదేహాలు ఇన్ని రోజులు ఉండిపోవాల్సి వస్తోంది.
మరోవైపు ఏడాదికాలంగా దాదాపు 150 మృతదేహాలు సౌదీలో ఉండిపోయాయంటూ జరుగుతున్న ప్రచారంలో ఎటువంటి వాస్తవం లేదని ఆయన తెలిపారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన వారివి దాదాపు 150 మృతదేహాల దాకా సౌదీలోని పలు ఆస్పత్రుల్లో ఉన్నట్టు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని ఆయన చెప్పారు. అయితే 10 మృతదేహాలు మాత్రం చాలా కాలంగా సౌదీలోని ఆసుపత్రుల్లో ఉండి పోయినట్టు చెప్పారు. వాటిని కూడా స్వదేశానికి రప్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నామని అయినా సౌదీలో ఉన్న నిబంధనల కారణంగా వాటిని తీసుకుని రావడానికి సమయం పడుతోందని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *