సంచలనం రేపుతున్న ఆమీర్ ఖాన్ కొత్త సినిమా “దంగల్” పైరసీ వీడియో ఇంటర్నెట్ లో చక్కర్లు కొట్టింది. ఈ సినిమా పైరసీని ఒక వ్యక్తి తన ఫేస్ బుక్ అకౌంట్ లో అప్ లోడ్ చేశాడు. పూర్తి నిడివి గల ఈ సినిమా పేస్ బుక్ లో ప్రత్యక్షంగా కావడం సచలనం కలిగించింది. సదరు వ్యక్తి ప్రోఫైల్ ను బట్టి అతను దుబాయి కి చెందిన వ్యక్తిగా అనుమానిస్తున్నారు. ఫేస్ బుక్ లో హష్మీ పేరుతో ఉన్న ఖాతాలో ఈ సినిమాలో దర్శనమిచ్చింది పోస్టు చేసిన 14 గంటల్లోనే ఈ సినిమాను ఎనిమిది లక్షల 33 వేల మంది చూశారు. దీనిపై చిత్ర నిర్మాతలు ఫిర్యాదు చేయడంతో ఫేస్ బుక్ యాజమాన్యం సదరు చిత్రాన్ని ఫేస్ బుక్ నుండి తొలగించింది. ప్రతిష్టత్మకంగా తీసిన చిత్రానికి కూడా పైరసి ఎదురుకావడం పట్ల బాలీవుడ్ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.