ఫైనల్ కు చేరిన క్రోయేషియా

0
124
క్రోయేషియా

ఫిఫా 2018 ప్రపంచకప్ పుట్ బాల్ లో మరో సంచలనం. ఇంగ్లాండ్ ఆశలను భగ్నం చేస్తూ క్రోయేషియా ప్రపంచ ఫుట్ బాల్ టోర్నీలో ఫైనల్ లోకి దూసుకొనిపోయింది. సెమీఫైనల్స్ లో క్రోయేషియా ఎదురుకావడంతో ఇక ఫైనల్ కు చేరడం ఖాయమని, కప్ తమ ఖాతాలో వేసుకుందామని కలలుగన్న ఇంగ్లాండ్ ఆశలు గల్లంతయ్యాయి. రష్యాలోని లుజ్నికీ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో క్రోయేషియా ఇంగ్లాండ్ ను 2-1 తేడాతో ఓడించి తొలిసారిగా ప్రపంచకప్ ఫైనల్ కు చేరుకుంది. ఆదివారం జరిగే ఫైనల్స్ లో ఆజట్టు ఫ్రాన్స్ తో తలపడుతుంది.
క్రోయేషియా ఇంగ్లాండ్ ల మధ్య మ్యాచ్ హోరాహోరీగా సాగింది. ఇరు జట్ల అభిమానులో స్టేడియం నిండిపోయింది. మ్యాచ్ ప్రారంభమైన 5 నిమిషాలకో ఇంగ్లాండ్ తొలిగోల్ చేయడంతో ఇంగ్లాండ్ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కీరన్‌ ట్రిప్పర్‌ గోల్ తో ఆధిఖ్యంలోకి వెళ్లిన ఇంగ్లాండ్ మ్యాచ్ ప్రధమార్థం వరకు ఆధిక్యాన్ని నిలబెట్టుకుంది. 1966 తరువాత మరోసారి తమ జట్టు ఫైనల్ లోకి దీసుకుని పోవడం ఖాయం అని భావించిన ఇంగ్లాండ్ అభిమానులకు మ్యాచ్ 68వ నిమిషంలో ఎదురుదెబ్బ తగిలింది. క్రోయేషియా ఆటగాడు ఇవాన్ పెరిసిక్ గోల్ చేయడంతో స్కోర్ 1-1తో సమం అయింది. దీనితో మ్యాచ్ కు అదనపు సమయాన్ని ఇచ్చారు. ఇందులో క్రోయేషియా ఆడగాడు మారియే మండ్జకిక్ 109 నిమిషంలో గోలే చేయడంతో క్రోయేషియా ఇంగ్లాండ్ ఓడించి ఫైనల్ కు దూసుకుని పోయింది.
ఫుట్ బాల్ ప్రపంచ కప్ ఆరంభమైన సమయంలో క్రోయేషియా ఫైనల్ కు చేరుకుందని ఎవరూ ఊహించలేదు. ఎటువంటి అంచానాలు లేకుండా టోర్నీలో అడుగుపెట్టిన క్రోయేషియా సంచలనాలు సృష్టిస్తూ ఫైనల్ కు చేరుకుంది. ఈ ఐరోపాజట్టు ఫుట్ బాల్ ప్రపంచకప్ ఫైనల్ కు చేరడం ఇదే తొలిసారి.
fifa, fifa world cup, croatia, croatia football, football cup final, france vs croatia.

స్వామి పరిపూర్ణానంద కు నగర బహిష్కరణ


చిక్కుల్లో పడ్డ మహిళా క్రికెట్ జట్టు స్టార్ క్రీడాకారిణి

Wanna Share it with loved ones?