క్రికెటర్ ఎం.వి.శ్రీధర్ మృతి

ప్రముఖ మాజీ క్రికెటర్ ఎం.వి.శ్రీధర్ (53) మృతి చెందారు. గుండెపోటుతో ఆయన తుదిశ్వాస విడిచారు. రంజీ ఆటగాడయిన శ్రీధర్ హైదరాబాద్ క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. భారత జట్టుకు ఎంపికయ్యే అవకాశాన్ని కొద్దిలో చేజార్చుకున్న ఆయన తన రంజీ కెరీర్ లో 6701 పరుగులు చేశారు. వీటిలో 21 సెంచరీలు కూడా ఉన్నాయి. సుదీర్ఘ కాలంపాటు హైదరాబాద్ రంజీ జట్టులో ఆటగాడిగా ఉన్న ఎం.వీ.శ్రీధర్ అటు తర్వతా క్రికెట్ బోర్డులోనూ కీలక పదవులు నిర్వహించారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కు కార్యదర్శిగా చాలా కాలంపాటు పనిచేశారు. పలువురు భారతీయ క్రికెటర్లతో శ్రీధర్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆయన అంత్యక్రియలు మంగళవారం నిర్వహించనున్నట్టు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.