కనిపించని గ్రీన్ దీపావళి ప్రచారం-జోరుగా బాణాసంచా అమ్మకాలు

దీపావళి పండుగను పురస్కరించుకుని బాణాసంచా అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. గ్రీన్ దీపావళి అంటూ జరుగతున్న ప్రచారానికి ప్రజల్లో పెద్దగా స్పందన కనిపించడం లేదు. దీపావళి పటాకుల అమ్మకాలు సాధారంగానే ఉన్నట్టు అమ్మకం దారులు చెప్తున్నారు. అయితే జీఎస్టీ వల్ల వీటి ధరలు విపరీతంగా పెరిగాయని ధరల పెరుదల ప్రభావం మాత్రం అమ్మకం పై ఉన్నట్టు వారు చెప్తున్నారు. బాణా సంచను కాల్చవద్దంటూ జరుగుతున్న ప్రచారం వల్ల అమ్మకాల్లో వచ్చిన మార్పు ఏమీ లేదని బాణాసంచా విక్రయదారులు చెప్తున్నారు. కాలుష్యం పేరుతో బాణా సంచాకు దూరంగా ఉండేందుకు సిద్ధంగా లేమని ఇటు కోనుగోలుదారు చేప్తున్నారు. ధరలు పెరిగినప్పటికీ పండుగ సందర్భంగా బాణాసంచాను కొనుగోలు చేయక తప్పదని వారంటున్నారు.