గవర్నర్ పై కాంగ్రెస్ తీవ్ర వ్యాఖ్యలు

ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ పై తెలంగాణ కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో ఇసుక మాఫియా పై ఫిర్యాదు చేసేందుకు రాజ్ భవన్ కు వచ్చిన కాంగ్రెస్ నేతలకు గవర్నర్ నరసింహన్ కు మధ్య వాదులాట జరిగినట్టు తెలుస్తోంది. తెలంగాణలో ఇసుక మాఫియా రోజురోజుకీ పెరిగిపోతోందని దీనిపై చర్యలు తీసుకోవాలని కోరూతు కాంగ్రెస్ ప్రతినిధులు గవర్నర్ ను కలిశారు. ఈ సందర్భంగా ఇటీవల జరిగిన పలు ఘటనలను వారు ప్రస్తావించారు. ప్రాణాలు తీయడానికి కూడా ఇసుక మాఫియా తెగిస్తోందని కాంగ్రెస్ నేతలు చెప్తున్న సమయంలో తన వద్ద ఉన్న సమాచారాన్ని గవర్నర్ కాంగ్రెస్ నేతల వద్ద ప్రస్తావించినట్ట సమాచారం. కాంగ్రెస్ నేతలు చెప్పిన విషయాన్ని గవర్నర్ కొట్టిపారేయడంతో వారు గవర్నర్ తీరును పట్టుపట్టినట్టు తెలుస్తోంది. ఒక దశలో కాంగ్రెస్ హయంలోనే మీరు గవర్నర్ అయ్యారనే సంగతిని గుర్తుపెట్టుకోవాలంటూ తీవ్రంగా వ్యాఖ్యానించినట్టు సమాచారం. అంతటితో ఆగకుండా టీఅర్ఎస్ కు వత్తాసు పలుకుతున్నారంటూ గవర్నర్ పై ఆక్రోశం వెళ్లగక్కినట్టు తెలుస్తోంది. ఒక్కసారిగా పరిస్థితి చేయిదాటేలా కనిపించడంతో అటు కాంగ్రెస్ నేతలు ఇటు గవర్నర్ కూడా కొంత వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది.
గవర్నర్ వ్యవహారంపై కొంతమంది కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము ఫిర్యాదు చేయడానికి వెళ్తే తమనే ఇంటరాగేషన్ చేసిన విధంగా గవర్నర్ మాట్లాడారని వారు ఆసహనం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రికి పూర్తిగా అనుకూలంగా వ్యవహరిస్తూ ప్రజా సమస్యలను గవర్నర్ అసలు పట్టించుకోవడం లేదనేని కాంగ్రెస్ నేతల వాదన. ఫిర్యాదు స్వీకరించే సమయంలో ఆయన వ్యవహార శైలి అసలు బాగాలేదని వారంటున్నారు. దీనిపై ముందుగా పార్టీ అధిష్టానంతో చర్చించిన తరువాత గవర్నర్ పై రాష్ట్రపతికి ఫిర్యాదు చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *