కాంగ్రెస్-జేడీఎస్ ల మధ్య విభేద్దాల్లేవ్

0
84
కాంగ్రెస్-జేడీఎస్ మైత్రికి ఎటువంటి ఇబ్బంది లేదంటున్న కాంగ్రెస్ నేతలు
congress and jds

కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న కాంగ్రెస్-జేడీఎస్ ల మధ్య అధికారం పంచుకునే విషయంలో లుకలుకలు మొదలైనట్టు వస్తున్న వార్తల్లో ఏమాత్రం లేదని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. అధికారాన్ని పంచుకునే విషయంలో జేడీఎస్ తో ఎటువంటి విభేదాలు లేవని కర్ఠాక కాంగ్రెస్ సహాయ ఇన్ చార్జీ ముధు యాష్కి స్పష్టం చేశారు. అధికారాన్ని పంచుకోవాలని భావిస్తున్నట్టుగా జరుగుతున్న ప్రచారంలో ఎటువంటి వాస్తవం లేదని ఆయన తెలిపారు. ఐదేళ్లపాటు సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంపైనే ప్రస్తుతం తాము దృష్టిపెట్టామని మధు యాష్కి చెప్పారు.
కొన్ని వర్గాలు పనిగట్టుకుని కాంగ్రెస్-జేడీఎస్ ల మధ్య విభేదాలు వచ్చినట్టుగా ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఎటువంటి ఇబ్బందులు లేకున్నా ఇబ్బందులు ఉన్నాయంటూ ప్రచారం చేసుకుంటూ ఆత్మతృప్తి పొందుతున్నారని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ జేడీఎస్ తో అన్ని విషయాలను గురించి చర్చిస్తోందని అన్నారు. అక్రమమార్గాల్లో అధికారంలోకి రావడానికి బీజేపీ చేసిన ప్రయత్నాలు కోర్టు అడ్డుకుందని ప్రజల్లో పరువుపోయిన తరువాత బీజేపీ కాంగ్రెస్ పై అబద్దపు ప్రచారాలు చేస్తోందని మండిపడ్డారు.
జేడీఎస్ తో విభేదాలు ఏమాత్రం లేవని కాంగ్రెస్ పార్టీనే జీడీఎస్ కు ముఖ్యమంత్రి పదవిని ఇవ్వడానికి సిద్ధపడిందన్నారు. ఎటువంటి షరతులు లేకుండా కాంగ్రెస్ మద్దతు ప్రకటించిందని ఇందులో అనుమానాలకు తావే లేదన్నారు. దేశవ్యాప్తంగా బీజేపీ అరచాలను అడ్డుకునేందుకు కాంగ్రెస్ పార్టీ పనిచేస్తోందని ఇందుకోసం గాను భావసారూప్యత ఉన్న పార్టీలతో పొత్తు పెట్టుకుంటందన్నారు. బీజేపీని అడ్డుకునే క్రమంలో కాంగ్రెస్ పార్టీ త్యాగాలు చేసేందుకు కూడా సిద్దంగా ఉందన్నారు.
బీజేపీ అరాచకాలకు అడ్డకట్ట వేసే క్రమంలో అందరినీ కలుపుకుని పోతామన్నారు.
congress, karnataka congress party, karnataka, karnataka assembly, karnataka govenment.

రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ లో కొలువుల జాతర


మహానటి’లో నాన్నాను విలన్ గా చూపించారు: కమలా సెల్వరాజ్

Wanna Share it with loved ones?