రేవంత్ ఖచ్చితంగా గెలుస్తాడంటున్న కోమటిరెడ్డి

0
41

రేవంత్ రెడ్డి రాజీనామాతో ఆ నియోజక వర్గానికి ఎన్నికలు వస్తే ఖచ్చితంగా తిరిగి రేవంత్ రెడ్డి గెల్చితీరతాడని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రెవంత్ ఖచ్చితంగా గెలుస్తాడని ఇందులో ఎటువంటి అనుమానాలకు తావులేదన్నారు. టీఆర్ఎస్ ఎన్ని ప్రయత్నాలు చేసినా రేవంత్ ఓడించడం వారి వల్ల కాదన్నారు.రేవంర్ రెడ్డి గెలుపు కోసం తామంతా పనిచేస్తామని కోమటి రెడ్డి అన్నారు. రేవంత్ రాజీనామాకు సంబంధించిన పూర్తి సమాచారం తనకు తెలియదని కోమటిరెడ్డి స్పష్టం చేశారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఖచ్చితంగా 50 కి పైగా స్థానాలను గెల్చుకుంటుందని కొద్దిగా కష్టపడితే 60 నుండి 70 సీట్లు వస్తాయని కోమటిరెడ్డి జోస్యం చెప్పారు.
పాదయాత్రలకు కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోదని గతంలో తాను బట్టి విక్రమార్క పాదయాత్ర చేస్తామని ప్రతిపాదనలు పంపినా పార్టీ అధిష్టానం నుండి గ్రీన్ సిగ్నల్ రాలేదని అన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రాంతంలో బలంగా ఉందని అన్నారు. టీఆర్ఎస్ పై ప్రజలకు ఉన్న భ్రమలు తొలిగిపోయాయన్నారు.

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here