ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి కమ్యూనిస్టు ఛానళ్లు

0
135
టీవీ ఛానళ్లు

కమ్యూనిస్టు పార్టీలకు అనుబంధంగా పనిచేస్తున్న రెండు టీవీ ఛానళ్లు ఇప్పుడు ప్రైవేటు వ్యక్తుల పరమయ్యాయి. సీపీఐ పార్టీ టీవీ-99 పేరుతో ఒక ఛానల్ ను ప్రారంభించగా సీపీఎం 10 టీవీ పేరుతో మరో ఛానల్ ను తీసుకుని వచ్చింది. టీవీ-99 ఆదినుండి కష్టాలను ఎదుర్కొంది. సిబ్బందికి జీతాలు కూడా చెల్లించలేని స్థితిలోకి వెళ్లిపోయింది. ఆరంభం నుండే టీవీ-99 కు ఎక్కడా పెద్దగా ఆదరణ కనిపించలేదు. వ్యవస్థీకృత లోపాలు ఆ ఛానల్ ను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టాయి. దీనితో ఛానల్ నిర్వహణ బాధ్యతల నుండి సీపీఐ తప్పుకుంది. ఇప్పుడదని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోయింది.
జనసేన పార్టీకి చెందిన వారు ఇప్పుడు టీవీ-99 నిర్వహణ బాధ్యతలను చూస్తున్నారు. నగరంలో పేరుగాంచిన బిల్డర్, మాజీ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్ ప్రస్తుతం టీవీ-99 ను కొనుగోలు చేశారు. చిరంజీవి కుటుంబానికి దగ్గరి వ్యక్తిగా పేరుగాంచిన ఆయన ప్రజారాజ్యం తరపున ఎంపీగా పోటీచేసి ఓడిపోయారు. ఆటు తర్వాత ఆయన వైఎస్ కాంగ్రెస్ పార్టీలో చేరి ఎంపీగా పోటీచేసినా ఫలితం లేకుండా పోయింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కు సన్నిహితంగా ఉంటున్న తోట చంద్రశేఖర్ టీవీ-99 ను కొనుగోలును పూర్తిచేశారు. పూజాకార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటుగా జనసేన కార్యకర్తలకు టీవీ-99 గురించిన సమాచారం చేరిపోయింది. ఇక పవన్ కళ్యాణ్ కు అనుకూలంగా ఆ ఛానల్ వ్యవహరించనుంది.
10 టీవీ పేరుతో ప్రజల నుండి సేకరించిన విరాళాలు, వాటల ద్వారా ప్రారంభమైన ఛానల్ తెలుగు రాష్ట్రాల్లో మంచిపేరే సంపాదించుకుంది. రెండు రాష్ట్రల్లోనూ దాదాపు అన్ని నెట్ వర్క్ లలో ఈ ఛానల్ ప్రసారం అవుతోంది. దీనితో పాటుగా ఛానల్ రేటింగ్ కూడా చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఉంది. వార్తలు ప్రసారాల్లో కమ్యూనిష్టు పార్టీ ముద్ర కనపించినప్పటికీ పోటీ ఛానళ్లకు ధీటుగా 10టీవీ ఎదిగింది. అన్ని రకాలవార్తలను ప్రసారం చేస్తూనే తన ముద్రను కొనసాగిస్తూ వస్తున్న ఈ ఛానల్ ను పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ కొనుగోలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ముంబాయికి చెందిన కొంతమందిని ముందుంచి తెరవెనుక తతంగాన్ని నిమ్మగడ్డ నడిపిస్తున్నట్టు సమాచారం. ఈ వ్యవహారంలో చిరంజీవి కీలక పాత్రను పోషిస్తున్నట్టు తెలుస్తోంది. నిమ్మగడ్డ ప్రసాద్ ప్రస్తుతం జగన్ వెనకాల ఉన్నప్పటికీ రానున్న రోజుల్లో పరిస్థితులు మారతాయనే ప్రచారం జరుగుతోంది. గతంలో మా టీవీని నిర్వహించిన అనుభవం పుష్కలంగా ఉన్న నిమ్మగడ్డ ప్రసాద్ తాను తెరవెనుక ఉండి 10టీవీ కొనుగోలు చేస్తున్నట్టు తెలుస్తోంది.
మొత్తంమీద తెలుగు రాష్ట్రాల నుండి కమ్యూనిష్టుపార్టీలకు చెందిన రెండు ఛానళ్లు కనుమరుగు కానున్నాయి. దశాబ్దాల పాటుగా పత్రికలను విజయవంతంగా నడిపించుకుంటూ వస్తున్న కమ్యూనిష్టు పార్టీలు ఛానళ్ల నిర్వహణలో మాత్రం పూర్తిగా విఫలం అయినట్టే కనిపిస్తోంది.
telugu news channels, news channels, tv-99, 10 tv, nimmagadda prasad, matrix prasad, pawan kalyan, janasena, janasena party, telugu, news, channels, 10tv shows, tv-99 news, aditya constructions,

ఏపీలో కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు ఫలిస్తాయా?


చ్చే ఎన్నికల్లో మాదే అధికారం: ఉత్తమ్ కుమార్ రెడ్డి
నిమ్మగడ్డ ప్రసాద్

Wanna Share it with loved ones?