తెలంగాణను వణికిస్తున్న చలి

cold in telangana ఉత్తర, ఈశాన్య భారతదేశం నుండి వస్తున్న చలిగాలులు తెలంగాణ ప్రజలను వణికిస్తున్నాయి. హిమాలయాల నుండి వీస్తున్న చిలిగాలులకు తెలంగాణ గజ,గజ వణుకుతోంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అత్యత్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆదిలాబాద్ లో కనిష్ట ఉష్ణోగ్రతలు 5 డిగ్రీలకు పడిపోతోంది. ఇది సాధారణం కన్నా 6 డిగ్రీలు తక్కువని వాతావరణ శాఖ తెలిపింది.
ఉమ్మడి ఆదిలాబాద్, మెదక్ జిల్లాలతో పాటుగా రంగారెడ్డి, హైదరాబాద్ లలో చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. ఉత్తరాది నుండి వీస్తున్న చలిగాలులు తొలుత ఈ జిల్లాలను తాకడం వల్లే ఇక్కడ విపరీతమైన చలి ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. హైదరాబాద్ లో ఉష్ణోగ్రతలు 9 నుండి 11 డిగ్రీలకు పడిపోయాయి. తెల్లవారు జామున విపరీతమైన చలితో నగరం వణిపోతోంది. మరో వైపు పగటి పూట ఎండలు కూడా ఎక్కువగానే నమోదవుతున్నాయి. హైదరాబాద్ లో సాధారణంగా వాతావరణంగా ఉండాల్సిన తేమ శాతం కూడా గణనీయంగా పడిపోవడం కూడా మధ్యాహ్నం పూట చుర్రుమనే ఎండ రాత్రి పూడ విపరీతమైన చలికి కారణమని వాతావరణ శాఖ తెలిపింది.
Dream Home