ఆ పందాల విలువ 500 కోట్లు

కోడిపందాల్లో కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నాయి. పెద్ద మొత్తంలో పందాయరాయుళ్లు పందాలు, పై పందాలు కాస్తున్నారు.  సంక్రాంతి మూడు రోజుల పాటు కోడి పందాలకు దాదాపుగా ఐదు వందల కోట్ల రూపాయల దాకా చేతులు మారతాయని అంచానా. పెద్ద నోట్లు రద్దు కావడంతో ఈ దఫ కోడి పందాల జోరు కాస్త తగ్గుతుందని ఆశించినా అటువంటిది ఏమీ లేదు. పెద్ద మొత్తంలో నగదు చేతులు మారుతోంది. దీనితో పాటుగా కొన్ని చోట్ల ఆన్ లైన్ ట్రాన్స్ ఫర్ లు, స్వైపింగ్ యంత్రాలు కనిపించినా వాటి సంఖ్య తక్కువగానే ఉంది. నగదు లావాదేవీలే ఎక్కువగా జరుగుతున్నాయి. కార్డులను స్వైప్ చేసి అప్పటికప్పుడు నగదు సమకూర్చే వ్యక్తులు పెద్ద సంఖ్యలో కనిపిస్తున్నారు. కొంత మొత్తంలో కమీషన్ తీసుకుని వారు ఈ వ్యాపారం చేస్తున్నారు. మరో వైపు కోళ్ల పందాల కోసం ముందు నుంచే నగదును సమకూర్చుకున్నట్టు పందెపు రాయుళ్లు చెప్తున్నారు.
గతంలోనూ కోళ్ల పందాలు జరిగినా ఈ స్థాయిలో జరగలేదని గత పది సంవత్సరాల నుండి పందాలు విపరీతంగా జరుగుతున్నయాని స్థానికులు చెప్తున్నారు. సంక్రాంతి మూడు రోజుల పాటు దాదాపుగా 500 కోట్ల రూపాయల మేర పందాలు జరుగుతాయని అంటున్నారు. పై పందాలు, కోసు పందాలంటూ అంతకు రెట్టింపు సంఖ్యలో నగదు చేతులు మారుతూ ఉంటుంది. గతంలోనూ కోడి పందాలు జరిగినా ఈ స్థాయిలో పందాలు జరేగివికాదని అంటున్నారు. ఒక రకంగా టీవీలు కోడిపందాలకు ఎక్కువ ప్రచారం కల్పించాయని స్థానికులు చెప్తున్నారు. కోళ్ల పందాలపై చేతులు మారుతున్న డబ్బును చూస్తే కళ్లు బైర్లు కమ్మక మానవు.
 
Cock fight ….. a famous sport on the eve of Sankranti in Andhra Pradesh is held every year on a very big range as some crores of rupees are lost and won during the betting over a cock. Very small kniver are tied to the legs of each cock in this sport. Though the High Court has banned the sport as the bird gets hurt in this sport these are played in various places. With the ban of higher value currency notes it was expected that the betting would be effected this season but no. People are using technology for betting. Swiping machines are being supplied by the mediators with the collection of little commission and even otherwise the betters say they have been arranging money since some time for the same. Nothing can stop the lover of cock fight from betting over his favourite cock.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *