కేసీఆర్ తో హరీష్ రావు రహస్య మంతనాలు

0
96

ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీష్ రావుల రహస్య సమావేశంపై పార్టీలో తీవ్ర చర్చ జరుగుతోంది. అంతర్జాతీయ సదస్సు నేపధ్యంలో హరీష్ రావు పార్టీ అధిష్టానంపై అలక బూనాడంటూ వార్తలు వస్తున్న నేపధ్యంలో వీరిద్దరి మధ్య జరిగిన చర్చలు ప్రదాన్యం సంతరించుకున్నాయి. ముఖ్యమంత్రితో సమావేశామైన హరీష్ రావు ఆయనతో ఏకాంతంగా చర్చలు జరిపారు. విడిగా ఒక రూంలోకి వెళ్లిన వీరద్దరు ఒంటరిగా చర్చించుకున్నారు. పార్టీ వ్యవహారాల్లో అత్యంత చురుగ్గా ఉండే హరీష్ రావు పార్టీకి సంబంధించిన అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ తో చర్చలు జరిపినట్టు వార్తలు వస్తున్నాయి. హరీష్ రావు ఆగ్రహంతో ఉన్నారని ఈ నేపధ్యంలో వీరిద్దరి మధ్య భేటీ జరిగిందంటూ వస్తున్న వార్తలను పార్టీ వర్గాలు కొట్టి పారేస్తున్నాయి. రానున్న రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఇరవురు నేతలు చర్చలు జరిపారనేది పార్టీ వర్గాల సమాచారం.
కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ ఢిల్లీలో హరీష్ రావుతో సమావేశం అయిన తరువాత దీనికి సంబంధించిన వివరాలను ముఖ్యమంత్రికి హరీష్ రావు వివరించాలని తెలుస్తోంది. మరికొంత మంది ఎమ్మెల్యేలు, నేతలు టీఆర్ఎస్ లో చేరేందుకు సిద్ధపడుతున్నట్టు సమాచారం. దీనికి సంబంధించిన వివరాలను హరీష్ ముఖ్యమంత్రికి చెప్పినట్టు సమాచారం. ఎన్నికల సమయం దగ్గరపడుతున్న నేపధ్యంలో సంక్షేమ కార్యక్రమాల జోరును మరింత పెంచడంతో పాటుగా పార్టీ బలేపేతానికి తీసుకోవాల్సిన చర్యలను గురించి హరీష్ రావు ముఖ్యమంత్రితో చర్చలు జరిపారనే వార్తలు వస్తున్నాయి. హరీష్ రావు ప్రభుత్వం పై అసంతృప్తితో ఉన్నారనే వార్తలు ఏమాత్రం నిజంకావని పార్టీ వర్గాలు చెప్తున్నాయి.
అంతర్జాతీయ బిజినెస్ సమిట్ లో తనకు ప్రాధాన్యం దక్కలేదని హరీష్ రావు ఆగ్రహంతో ఉన్నట్టు జరుగుతున్న ప్రచారం కూడా కేవలం కల్పితమేనని ఆ వర్గాలు కొట్టిపారేస్తున్నాయి. పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ హరీష్ రావుకు ముఖ్యమంత్రి విశేష ప్రాధాన్యం ఇస్తారని వారంటున్నారు. ఎవరికి ఎటువంటి పనులు కేటాయించాలనే దానిపై ముఖ్యమంత్రకి స్పష్టమైన అవగాహన ఉందని ఈ మేరకే ఆయన వారికి పనులను పురమాయిస్తుంటారని అంటున్నారు.

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here