పెళ్లి మండపం లో సీఎం-అవాక్కైన దంపతులు

కరీంనగర్ జిల్లా తడికెల్ వద్ద ఓ వివాహం జరుగుతోంది…. వధువరులు సంప్రదాయ బద్దంగా ఒకటవుతున్నారు… పేదింటి పెళ్లి కావడంతో పెద్దగా హంగు ఆర్భాటాలు ఏవీలేవు… కొంత మంది బంధువులు, స్నేహితులు, సన్నిహితుల మధ్య నిరాడంబరంగా పెళ్లి తంతు జరుగుతోంది… ఇంతలో హఠాత్తుగా ఈ పెళ్లికి ఓ అనుకోని అతిధి హాజరయ్యారు. పేదింటి కళ్యాణానికి వచ్చింది సాదాసీదా వ్యక్తేమీ కాదు సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి. అంతే అక్కడున్నవారి నోట మాటరాలేదు. ముఖ్యమంత్రి ఏంటీ తమ ఇంట పెళ్లికి రావడం ఏంటని అక్కడున్నవారంతా ఆశ్చర్యంలో మునిగిపోయారు. పెళ్లికి వచ్చిన ముఖ్యఅతిధి మాత్రం చిరునవ్వుతో వధూవరులను నిండు మనసుతో ఆశీర్వదించి అక్కడి నుండి కదిలారు.
రైతు బంధు కార్యక్రమంలో పాల్గొనడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బస్సులో కరీంనగర్ నుండి హుజురాబాద్ వెళ్తున్నారు. మార్గమధ్యంలో తడికెల్ వద్ద పెళ్లి వేదికను చూసిన సీఎం వెంటనే కాన్వాయ్ ను ఆపించి పెళ్లి మండపం వద్దకు చేరుకున్నార. అంతే అక్కడున్న వారంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి కేసీఆర్ తమ పెళ్లి రావడంతో ఆ నూతన వధూవరుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. నూతన దంపతులను ఆశీర్వదించిన ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ లు అక్కడి నుండి బయలుదేరారు. కళ్యాణలక్ష్ని పథకం ద్వారా వారికి ఆర్థిక సాయాన్ని అందిస్తానని ముఖ్యమంత్రి భరోసాఇచ్చారు.
telangana, telangana cm, telangana cm kcr, marriage, cm in marriage, cm attended to marriage.

రైతు బంధు పథకం దేశానికే ఆదర్శం: కేసీఆర్


goshala
Telangana