బ్రాహ్మణ పరిషత్ సభ్యుడు రాజాం రాజీనామాకు కారణాలేంటి..!

0
72

బ్రాహ్మణ పరిషత్ సభ్యుడు, కోశాధికారి సీఎల్ రాజాం తన పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాలుకు దారితీసిన పరిస్థితులపై రాజకీయ, బ్రాహ్మణ వర్గాల్లో తీవ్ర చర్చజరుగుతోంది. తెలంగాణలోని బ్రహ్మణుల సంక్షేమం కోసం ప్రభుత్వం పరిషత్ ను ఏర్పాటు చేసింది. దీనికి అధ్యక్షుడిగా మాజీ ఐఏఎస్ అధికారి, ప్రభుత్వ సలహాదారు కే.వీ.రమణాచారి వ్యవహరిస్తుండగా రాజ్యసభ సభ్యుడు కెప్టెన్‌ లక్ష్మీకాంతరావు, ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి డా.సముద్రాల వేణుగోపాల చారి, సీఎల్ రాజంలతో పాటుగా మొత్తం 18 మంది సభ్యులుగా ఉన్నారు. పరిషత్ ఆమోదించిన రుణాలకు సంబంధించిన నిధులను లబ్దిదారులకు ప్రభుత్వం విడుదల చేయకపోవడం,కొత్తగా రుణాల ధరఖాస్తులు స్వీకరించడం నిలిపివేయడం వంటి పరిణామాలతో పరిషత్ కార్యకలాపాల పట్ల విషయంలో పలు అనుమానాలు వ్యక్తం అయ్యాయి.
తెలంగాణ బ్రాహ్మణ పరిషత్ కు సంబంధించి రుణాలకోసం పలువురు ఎదురు చూస్తున్న సమయంలోనే ఇందులో కీలక సభ్యుడు సీఎల్ రాజాం తన పదవికి రాజీనామా చేశారు. ‘నమస్తే తెలంగాణ’ పత్రిక వ్యవస్థాపకుడైన రాజాం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తరవాత కొద్దిరోజులకు పత్రికా నిర్వహణ బాధ్యతల నుండి తప్పుకున్న ఆయన ‘విజయక్రాంతి ‘ పేరుతో కొత్త దినపత్రికను ప్రారంభించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా చెప్పుకునే రాజాం క్రమంగా ఆయనకు దూరం అయ్యారని అంటున్నారు.
రాజాం తన పదవికి రాజీనామా చేయడానికి రాజకీయ కారణాలతో పాటుగా పరిషత్ లో జరుగుతున్న కొన్ని పరిణామాల పట్ల విసుగు చెందిన ఆయన రాజీనామా లేఖను రమణాచారికి ఇచ్చారనే వార్తలు వస్తున్నాయి. ఒకప్పుడు టీఆర్ఎస్ పార్టీకి పూర్తి మద్దతుదారుడిగా ఉన్న రాజాం ముఖ్యమంత్రి కేసీఆర్ కు సన్నిహితుల్లో ఒకరు. అయితే నమస్తే తెలంగాణ బాధ్యతల నుండి తప్పుకున్న తరువాత జరిగిన పలు పరిణామాలు ఆయనకు బాధకలిగించాయని దీని వల్ల క్రమంగా టీఆర్ఎస్ తో పాటుగా ముఖ్యమంత్రికి కూడా దూరంగా ఉంటూ వచ్చారని రాజాం సన్నిహితుల కథనం. ఇటీవల కొత్త పత్రికను ప్రారంభించే సమయంలోనూ టీఆర్ఎస్ మినహా ఇతర పార్టీలకు చెందిన అగ్రనేతలంతా హాజరయ్యారు.
బ్రాహ్మణ వర్గంలో ప్రముకుడైనా రాజాంను పరిషత్ లో సభ్యుడిగా నియమించడంతో పాటుగా కీలకమైన కోశాధికారి పదవిని అప్పగించారు. అయితే పరిషత్ లోని కొన్ని పరిణామాల పట్ల పలుసార్లు రాజాం అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. రుణాల మంజూరు నుండి ఇతరత్రా ఆర్థిక అంశాలపై పరిషత్ లో విభేదాలు ఉన్నట్లు సమాచారం. సభ్యల్లో కొంతమంది పూర్తిగా తమ వ్యక్తిగత అవసరాలు, ప్రచారం కోసం పరిషత్ పేరును దుర్వినియోగం చేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.
ముఖ్యమంత్రితో దూరం పెరగడంతో పాటుగా పరిషత్ లోని వ్యవహారాలు నచ్చకనే రాజం అందులోనుండి బయటికి వచ్చినట్టు తెలుస్తోంది. అయితే తెలంగాణ బ్రాహ్మణ పరిషత్ నుండి ఎందుకు బయటకు వచ్చిందనే విషయాన్ని మాత్రం రాజం బయటికి చెప్పడం లేదు. కేవలం వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్టు ఆయమ పేర్కొన్నారు. ఆయన రాజీనామా చేసిన సమాచారన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ కు పంపుతున్నట్టు పరిషత్ అధ్యక్షుడు కేవీ రమణా చారి తెలిపారు.
cl rajam, namaste telangana, telangana brahmana parishad , brahmins, brahmana sangam, k.v.ramana chary, samudrala venugopala chary, lakshmikanth rao, telangana, telangana cm, kcr, brahmana upadhi.

Wanna Share it with loved ones?