52 సెకండ్లు నిల్చోలేని వారు సినిమాకు రావడం ఎందుకు…?

దేశం కోసం 52 సెకండ్లు నిలబడలేమా…! సినిమా హాళ్ళలో జాతీయ గీతం అవసరమా కాదా అనే అంశంపై ఇప్పుడు చర్చసాగుతోంది. ఇదే విషయంపై సుప్రీంకోర్టు కూడా కీలక వ్యాఖ్యలు చేసింది. సినిమాహాళ్లలో జాతీయ గీతం వస్తున్నప్పుడు నిల్చోనంత మాత్రనా దేశభక్తి లేనట్టేనా అంటూ ప్రశ్నించడంతో పాటుగా మోరల్ పోలీసింగ్ ను తప్పుపట్టింది. మరో వైపు కొంత మంది సినిమా హాళ్లలో జాతీయ గీతం వచ్చినప్పుడు నిల్చోవడం కష్టమవుతోందని… ముసలి వాళ్లు వికలాంగులు చాలా ఇబ్బందులు పడుతున్నారంటూ చేస్తున్న వ్యాఖ్యలు నిజంగా దారుణంగా ఉన్నాయి. మోకాళ్ల నొప్పితో బాధపడేవారు లేచి నిల్చోవడానికి ఇబ్బందులు పడుతున్నారంటూ వాదించడం చోధ్యంగా కనిపిస్తోంది. సినిమా హాళ్ల సీట్ల దాకా మరి వాళ్లు ఎట్లా వస్తున్నారు. సినిమా ధియేటర్లలో వీలై చైర్ సౌకర్యం ఉందా.. సీట్ల దాకా నడుచుకుంటూ రావడానికి ఓపిక ఉన్న వారికి 52 సెకండ్లు నిలబడడానికి వచ్చిన ఇబ్బంది ఏమిటి..?
సినిమా ధియేటర్లలో జాతీయ గీత ప్రదర్శన అవసరమా..కాదా.. అన్ని విషయాన్ని పక్కనపెడితే మోకాళ్ల నొప్పులు.. నిలబడలేరూ అంటూ చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం హాస్యాస్పదంగా ఉన్నాయి.