ఇంకా తెరుచుకోని సినిమా ధియేటర్లు

తెలుగు రాష్ట్రాల్లో సినిమా ధియేటర్ల బంద్ మరికొన్ని రోజులపాటు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లు, నిర్మాతల మధ్య జరుగుతున్న చర్చలు ఒక కొలిక్కి రాకపోవడంతో రెండు రాష్ట్రాల్లోనూ దాదాపుగా 1700 సినిమా ధియేటర్లు మూతపడ్డాయి. ధియోటర్లు మూతపడడంతో ప్రతీ రోజూ కోట్లాది రూపాయల నష్టం జరుగుతోంది. సోమవారం కూడా జరిగిన చర్చలు సఫలం కాలేదు. సినిమాల హాళ్లలో నీళ్లద్వారా ప్రదర్శనకు నిల్చిపోయి డిజిటల్ రూపంలో ప్రసారాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ డిజిటల్ రూపంలో ప్రసారాలు చేసినందుకు గాను సర్వీస్ ప్రొవైడర్ల వసులూ చేస్తున్న రుసుముతో పాటుగా ప్రకటనలు, ట్రైలర్ల విషయంలో సినీ నిర్మాతలు, ఎగ్జిబిటర్లతో సర్వీస్ ప్రొవైడర్లకు వివాదాలు తలెత్తాయి. మార్చి 2వ తేదీ నుండి కొనసాగున్న బంద్ ను ప్రస్తుతం 9వ కొనసాగించాలని నిర్మాతల భావిస్తోంది.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *