నిబంధనలకు వ్యతిరేకంగా చర్చీల నిర్వహణ :హింధూ సంఘాలు

మేడ్చల్ జిల్లాలో అక్రమంగా చర్చీల నిర్మాణ, నిర్వహణ జరుగుతోందని హింధు సంఘాలు ఆరోపిస్తున్నాయి. కొంతమంది ఇష్టానుసారంగా నిబంధనలకు పాతరేసి చర్చీలను నిర్మిస్తున్నా అధికారులు చోధ్యం చూస్తున్నారని వారు మండిపడుతున్నారు. జిల్లాలోని కాప్రా మండలం బాలాజీ నగర్ రోడ్డులోని వికలాంగుల కాలనీలో ఎటువంటి అనుమతులు లేకుండా చర్చీలను నిర్వహిస్తున్నారని వారు చెప్తున్నారు. నిబంధనల ప్రకారం ప్రభుత్వ స్థలాల్లో లేదా ప్రభుత్వానికి చెందిన భవనాల్లో చర్చీల నిర్మాణం కానీ నిర్వహణ చేపట్టకూడదని అయితే ఇటువంటి నిబంధనలు ఏవీ పట్టించుకోకుండానే వాటిని నిర్వహిస్తున్నారని వారు చెప్తున్నారు.
హింధువులకు సంబంధించిన దేవాలయాల పట్ల నిబంధనల పేరుతో కఠినంగా వ్యవహరించే హింధూ సంఘాలు ఇతర మతాలకు చెందిన నిర్మాణాల పట్ల ఎందుకు ఊదాశీనంగా వ్యవహరిస్తున్నారని వారు మండిపడ్డారు. వికలాంగుల కాలనీకి సంబంధించిన విషయానికి వస్తే ఇక్కడ ప్రభుత్వానికి చెందిన భవనాల్లో ఇష్టానుసారంగా చర్చీలను నిర్వహిస్తున్నారని ఇవి పూర్తిగా నిబంధనలకు విరుద్దంగా నడుస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. హింధు దేవాలయాల, గేశాలల విషయంలో నిబంధనల పేరిట నిర్మాణాలను కూలగొట్టడం, గోశాలకు తాళాలు వేయడం చేస్తున్న అధికారుల కంటికి ఇతర మతాలకు చెందిన వారు నిబంధనలు భేఖాతరు చేస్తూ చేస్తున్న చర్యలు ఎందుకు కనిపించడంలేదంటున్నారు.
రాజకీయ ఒత్తిడుల ఫలితంగానే హింధూయేతర మతరాలకు సంబంధించిన వ్యవహారాలలో నిబంధనలను పట్టించుకోవడం లేదని వారు ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో అధికారులు సత్వరం చర్యలు తీసుకోవాలని లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు దిగుతామని వారు హెచ్చరించారు.

మచ్చబొల్లారం గోశాలను తెరిపించాలి:హింధు సంఘాల డిమాండ్


తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల
Medchal