రెండు కోట్లిస్తే అంతా చెప్తానంటున్న గేల్

తన ఆటతీరుతో పాటుగా వ్యవహార శైలి కారణంగా ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించుకున్న విండీస్ ఆటగాడు క్రిస్ గేల్ ఒక్క ఇంటర్వ్యూ కోసం దాదాపు రెండు కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తున్నాడు. అయితే ఇది సాధారణ ఇంటర్వ్యూ కాదు గేల్ మీద వచ్చిన ఆరోపణల పై ప్రత్యేక ఇంటర్వ్యు ఇవ్వాడానికి ఈ భారి మొత్తం చెల్లించాలని గేల్ కోరుతున్నాడు. 2015 ప్రపంచ కప్ సందర్భంగా ఆస్ట్రేలియా మసాజ్ థెరపిస్టులో గేల్ అసభ్యంగా ప్రవర్తించాడని ఆసీస్ మీడియా ఇచ్చిన వార్తలపై కోర్టుకెక్కిన గేల్ ఆ కేసులో గెలిచాడు. అయితే అసలు ఆరోజు ఏం జరిగింది అనే విషయాన్ని చెప్పేందుకు మూడు లక్షల డాలర్లు ఇవ్వాలని ఎవరు అంత మొత్తం ఇస్తారో వారికి పూర్తి వివరాలు వెల్లడిస్తానంటూ గేల్ ట్విట్ చేశాడు.
ఆటతో పాటుగా ప్రకటనలు టీవీ షోల ద్వారా భారీగా ఆర్జిస్తున్న క్రిస్ గెల్ ఇప్పుడు ఇంటర్వ్యూలను కూడా సొమ్ము చేసుకునే పనిలో పడ్డాడు. అయితే ఇప్పటి వరకు ఎవరూ గేల్ సంప్రదించలేదట…