తొలి రాత్రే నరకం చూపించిన భర్తపై కఠిన చర్యలకు డిమాండ్

తొలిరాత్రే భర్త చేసిన అఘాయిత్యానికి బలై తీవ్రంగా గాయపడ్డ బాధితురాలిని పలు మహిళా సంఘాల నాయకురాళ్లు పరామర్శించారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన శైలజకు అన్ని విధాలుగా అండగా ఉంటామని వారు భరోసా ఇచ్చారు. నన్నపనేని రాజకుమారితో పాటుగా పలు మహిళా సంఘాల కు చెందిన వారు శైలను పరామర్శించి భరోసా ఇచ్చారు. పెళ్లైన వెంటనే తొలిరాత్రే భార్యతో అత్యంత కిరాతకంగా వ్యవహరించిన భర్త రాజేష్ ను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. పోలీసుల కష్టడీలో ఉన్న రాజేష్ ను కోర్టులో ప్రవేశపెట్టారు. మోసం ,దాడితో సహా పలు సేక్షన్ల కింద కేసును నమోదు చేశారు.
సంసారానికి పనికిరాని రాజేష్ పెళ్లి చేసుకోవడమే కాకుండా ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పిందనే అక్కసుతో ఆమెను తీవ్రంగా హింసించిన సంగతి తెలిసిందే. తీవ్రంగా గాయపడిన ఆమె ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. పెళ్లైన తరువాత అదే రోజున బాధితురాలి ఇంట్లో ఏర్పాటు చేసిన తొలిరాత్రిలో అతని వ్యవహారం సరిగా లేదని లోపలికి వెళ్లిన కొద్ది సేపటికే బయటికి వచ్చిన శైలజ తల్లిదండ్రులతో ఈ విషయాన్ని చెప్పింది. అయితే అమ్మాయికి సర్థి చెప్పిన వారు తిరిగి గదిలోకి పంపడంతో మరింత రెచ్చిపోయిన అతగాడు బాధితురాలి మొహంతో పాటుగా శరీరం అంతా కమిలిపోయేటట్టు కొట్టాడు. మొహం మీద తీవ్రంగా కొట్టడంతో ఆ అమ్మాయి గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. అప్పటివరకు పెళ్లి ఫొటోల్లో అందంగా కనిపించిన ఆమె కొద్ది గంటల తేడాలోనే మొహం అంతా దెబ్బలతో భయంకరంగా తయారయింది.
రాజేష్ తో పాటుగా అతని తల్లిదండ్రులను కూడా కఠినంగా శిక్షించాలని బాధితురాలి బంధువులు డిమాండ్ చేస్తున్నారు. గదిలోకి వెళ్లిన కొద్ది సేపటికి బయటికి వచ్చిన అమ్మాయి అతని ప్రవర్తన సరిగా లేదని చెప్పినప్పటికీ తాము అంతగా దృష్టిపెట్టలేదని సర్థుకుంటుందని అనుకున్నామని వాపోతున్నారు.Leave a Reply

Your email address will not be published. Required fields are marked *