అమెరికా లక్ష్యంగా చైనా బాంబర్ల విన్యాసాలు-తీవ్ర ఉధ్రిక్తత

0
73

అగ్రరాజ్యం అమెరికాపై దాడికి చైనా ప్రయత్నాలు చేస్తోందనే వార్తలు ఇప్పుడు అంతర్జాతీయ సమాజంలో తీవ్ల కలకలం రేపుతున్నాయి. అవసరం అయితే అమెరికాకు చెందిన గవామ్ ద్వీపంపై దాడి చేసేందుకు చైనా ఇప్పటికే వ్యూహాలను సిద్ధం చేసినట్టుగా వస్తున్న వార్తలు కలకలం రేపుతున్నాయి. అమెరికాకు చెందిన గవామ్ ద్వీపాలను ధ్వంసం చేస్తామని.. అమెరికాతో యుద్ధానికి సిద్ధం అంటూ ఉత్తర కొరియా యుద్ధ సన్నాహాలు చేస్తుండగా మరో వైపు సందట్లో సడేమియా అన్న చందంగా చైనా కూడా అమెరికాకు చెందిన ఈ కీకల దీవులపై దాడులకు సన్నాహాలు చేసినట్టు ఆమెరికాకు చెందిన నిఘా వర్గాలు గుర్తించినట్టు సమాచారం. మరో వైపు చైనానే ఉత్తర కొరియాను రెచ్చగొట్టి అమెరికాకు వ్యతిరేకంగా ప్రకటనలు చేయిస్తోందనే అనుమానాలకు కూడా బలం చేకూరుతోంది.
గవామ్ పై దాడులు చేసేందుకు చైనా ముందస్తు సన్నాహాలు చేసిందని ఇందుకు తగ్గట్టుగానే చైనాకు చెందిన యుద్ధవిమానాలు రెక్కి నిర్వహించినట్టుగా అమెరికా రక్షణ వర్గాలు వెల్లడించాయి.చైనా వైమానికి దళంలో అత్యంత కీలకంగా చెప్పుకునే హెచ్-6కే బ్యాడ్జర్ యుద్ధవిమానాలు గవామ్ ద్వీపాన్ని లక్ష్యంగా చేసుకుని ట్రయల్ కూడా వేశయని అమెరికా అనుమానిస్తోంది. అత్యంత అరుదైన సమయాల్లో తప్ప ఈ యుద్ధ విమానాలను చైనా బయటకు తీయదు. అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య వీటిని బయటి ప్రంచానికి కనపడనీయకుండా ఉంటే చైనా ఈ యుద్ధ విమానాలతో గగనతలంలో చక్కర్లు కొట్టించడం ద్వారా అత్యంత తీవ్ర చర్యలకు సైతం తాము దిగగలమని గట్టి హెచ్చరికలు పంపినట్టుగానే భావిస్తున్నారు.
చైనా వైమానిక దళంలోనే అత్యంత కీలకమైన ఈ యుద్ధవిమానాలకు వేయి కిలోమీటర్ల దూరం ప్రయాణించగల క్షిపణులను చైనా అమర్చింది. వీటి ద్వారా కొరియా ద్వీపకల్పానికి దగ్గరలోని అమెరికాకు చెందిన గవామ్ ద్వీపాలను చైనా లక్ష్యంగా చేసుకున్నట్టు తెలుస్తోంది. రక్షణాత్మకంగా ఈ ద్వీపాలు అమెరికాకు అత్యంత కీలకమైనవి. చైనాతో పాటుగా ఉత్తరకొరియా లకు సమీపంలో ఉండే ఈ ద్వీపాలను కాపాడుకోవడం అమెరికాకు అత్యంత అవసరం. ప్రస్తుతం ఇక్కడ పెద్ద సంఖ్యలో అమెరికా నావికా, వైమానిక స్థావరాలు ఉన్నాయి. ఇక్కడి కార్యకలాపాలను మరింత పెంచేందుకు అమెరికా ప్రయత్నాలు చేస్తుండగానే చైనా యుద్ధసన్నాహాలు అమెరికాను కలవర పెడుతున్నాయి.

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here