వీడిన చిలుకానగర్ నరబలి మిస్టరీ

సంచలనం రేపిన చిలుకానగర్ చిన్నారి హత్య మిస్టరీ వీడింది. మొదటి నుండి అనుమానిస్తున్నట్టుగానే దీన్ని నరబలిగా పోలీసులు గుర్తించారు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు కేసును దాదాపుగా చేధించారు. గ్రహణం రోజున చిన్నారని బలి ఇచ్చినట్టు పోలీసులు దాదాపుగా నిర్ణారణకు వచ్చారు. చిన్నారి తల దొరికిన ఇంటి వారే ఈ హత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది.
చిలుకానగర్ లోని క్యాబ్ డ్రైవర్ రాజశేఖర్ ఇంటి మిద్దెపైన ఓ చిన్నారి తల లబించింది. రాజశేఖర్ అత్త తలను గుర్తించడంతో పోలీసులకు పిర్యాదు చేశారు. తన ఇంటిపైకి చిన్నారి తల ఎక్కడి నుండి వచ్చిందో తెలియదని చెప్పిన రాజశేఖర్ తనకు ఏ పాపం తెలియదని పోలీసులను నమ్మించే ప్రయత్నం చేశాడు. స్వయంగా అతనే ఫిర్యాదు చేయడంతో పోలీసులు కూడా మొదట రాజశేఖర్ అమాయకుడనే భావించారు. చిన్నారి తల మాత్రమే లభించడం మొండెం లభించకపోవడంతో ఈ హత్య ఎవరు చేశారో పోలీసులకు అంతుచిక్కలేదు. చంద్రగ్రహణం మరుసటి రోజు చిన్నారి తల లభించడంతో చిన్నారిని బలి ఇచ్చారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేశారు. అయితే క్షుద్రపూజలు జరిపిన ఆనవాళ్లు లభించకపోవడంతో ఈ కేసు మరింత క్లిష్టంగా మారింది. దీనికి తోడు చనిపోయిన చిన్నారి ఎవరనే విషయం కూడా తెలియలేదు. తమ చిన్నారి తప్పిపోయినట్టు ఎవరూ ఫిర్యాదు చేయకపోడంతో పోలీసులు ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.
రాజశేఖర్ ప్రవర్తపై అనుమానం రావడంతో మరింత లోతుగా విచారించడంతో పాటుగా అతని ఇంట్లో లంభించిన రక్తపు మరకలు, తలకు సంబంధించిన డీఎన్ఏ పరీక్షలు నిర్వహించగా చనిపోయిన చిన్నారి ఆడపిల్లగా తేలింది. రాజశేఖర్ ఇంట్లోని రక్తం మరకలు చిన్నారివేనని తేలడంతో పోలీసులు రాజశేఖర్ ను గట్టిగా ప్రశ్నించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. చంద్రగ్రహణం రోజున నరబలి ఇస్తే అతీంద్ర శక్తులు రావడంతో పాటుగా ఆనారోగ్య సమస్యలు తొలగుతాయని మంత్రగాళ్లు చెప్పిన ప్రకారం బోయిగూడలోని పుట్ పాత్ నుండి చిన్నారని అపహరించినట్టు రాజశేఖర్ వెల్లడించినట్టు తెలుస్తోంది. భార్యా భర్తలు ఇంట్లో నగ్నంగా పూజలు జరిపిన తరువాత చిన్నారిని బలిఇచ్చినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. చంద్రుడి కాంతి పడేలా చిన్నారి తలను ఉంచి మొండాన్ని ప్రతాప సింగారం వద్ద మూసీలో వేసినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది.