నాపై హత్యా ప్రయత్నం జరిగింది:బాల్క సుమన్

0
81
Chennur Assembly Constituency

Chennur Assembly Constituency చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గం పరధిలో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్న తనపై హత్యాప్రయత్నం జరిగిందని పార్లమెంటు సభ్యుడు బాల్క సుమన్ ఆరోపించారు. సొంతపార్టీ సభ్యులే తనపై హత్యాయత్నం చేశారని ఆయన అంటున్నారు. చెన్నూరు నుండి బాల్కసుమన్ ను పోటీకీ దింపుతున్నట్టు టీఆర్ఎస్ పార్టీ ప్రకటించింది. ముఖ్యమంత్రి ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో చెన్నూరు నుండి బాల్క సుమన్ పేరుంది. ఇక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే నల్లాల ఓదేలుకు టికెట్ నిరాకరించిన పార్టీ బాల్క సుమన్ ను అభ్యర్థిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనితో ఓదేలు వర్గీయులు తీవ్ర ఆగ్రహాంతో ఊగిపోతున్నారు. తమ నేతకు టికెట్ ఇవ్వాల్సిందేనని వారు పట్టుబడుతున్నారు. చెన్నూరు లో సుమన్ ను ప్రచారం చేయనిచ్చేదిలేదంటూ ఓదులు వర్గీయులు ప్రకటించారు.
నియోజకవర్గంలోని ఇందారం గ్రామంలో బాల్క సుమన్ ప్రచారం చేయడానికి ప్రయత్నించగా ఓదేలు వర్గీయులు దాన్ని అడ్డుకున్నారు. దీనితో ఓదులు-సుమన్ వర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. పరిస్థితి ఉధ్రిక్తంగా మారింది. ఈ క్రమంలోనే ఓదేలు అనుచరుడు రేగుంట గట్టయ్య ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో గట్టయ్యతో పాటుగా మరో ముగ్గురికి గాయాలయ్యాయి. ఆత్మహత్యకు ప్రయత్నించిన వ్యక్తికి సమీపంలో ఉన్న కొందరు పాత్రికేయులకు కూడా స్వల్పంగా గాయాలయ్యాయి. పోలీసులు సకాలంలో స్పందించి మంటలు ఆర్పి అతన్ని ఆస్పత్రికి తరలించారు.
అయితే ఇందారం గ్రామంలో తనపై పెట్రోలు చల్లి నిప్పంటించే ప్రయత్నం చేశారని బాల్క సుమన్ ఆరోపించారు. నోటిలో పెట్రోలు పోసుకుని తనపై చల్లే ప్రయత్నం చేశారని, తన ఒంటిపై పెట్రోల్ పడిందని ఆయన అంటున్నారు. కేసీఆర్ ఆదేశాల మేరకు తాను ఇక్కడి నుండి పోటీ చేస్తున్నానని ఎవరెన్ని కుట్రలు చేసినా భయపడే ప్రశక్తిలేదని సుమన్ స్పష్టం చేశారు. ఎవరెన్ని డ్రామాలు చేసినా తాను చెన్నూరు నుండి పోటీచేస్తానని అన్నారు. ఒకసారి నిర్ణయం తీసుకున్న తరువాత వెనకడుగు వేయబోనని ఆయన స్పష్టం చేశారు. టికెట్లు ఎవరికి ఇవ్వాలనే నిర్ణయం పార్టీ అధిష్టానం తీసుకుంటుందని వారి నిర్ణయం ప్రకారం నడుచుకోవాల్సిన భాద్యత తనపై ఉందన్నార. పార్టీ తీసుకున్న నిర్ణయం ప్రకారం తాను పనిచేస్తున్నానని ఈ క్రమంలో ఎటువంటి ఆటంకాలు ఎదురైనా భయపడేదిలేదన్నారు.
మరోవైపు తనకు ముఖ్యమంత్రి కేసీఆర్ పట్ల పూర్తి నమ్మకం ఉందని ఓదేలు చెప్పారు. టెకెట్ తనకే వస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. కొంత మంది తనకు టికెట్ రాకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని అయితే ఎవరెన్ని కుట్రలు చేసినా అంతిమంగా తనకే పార్టీ టికెట్ లభిస్తుందన్నారు. తనకు టికెట్ కేటాయించపోవడం పట్ల నిరసన వ్యక్తం చేస్తూ తనని తాను ఓదేలు గృహ నిర్బంధం చేసుకున్నారు. నియోజకవర్గంలోని టీఆర్ఎస్ కార్యకర్తలు ఓదులుకు టికెట్ ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తున్న క్రమంలోనే అటు బాల్క సుమన్ ప్రచారాన్ని ప్రారంభించడం ఉధ్రిక్తతకు దారితీసింది.
బాల్క సుమన్ ప్రచారాన్ని అడ్డుకోవడం సమంజసం కాదని టీఆర్ఎస్ కార్యకర్తలు అంటున్నారు. పార్టీ అదేశాల ప్రకారం నడుచుకోవాలి తప్ప పార్టీ ప్రకటించిన అభ్యర్థి ప్రచారాన్ని అడ్డుకోవాలని చూడడం సరికాదని వారు పేర్కొన్నారు.
chennur, balka suman , nallala odelu, trs, trs rebel.

సర్జికల్ స్ట్రైక్స్ పై అశక్తికర విషయాన్ని చెప్పిన కమాండర్


టీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా | trs List of mla candidates

Wanna Share it with loved ones?