తనది డబ్బులేని పేదల కులమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. సమాజంలో రెండే కులాలు ఉన్నాయని ఒకటి డబ్బు ఉన్న వారి కులం అయితే మరొకటి డబ్బులేని కులం అన్నారు. తనది పేదల కులమని పేర్కొన్నారు. పేదరికమే లేని సమాజం కోసం తాను కృషి చేస్తున్నట్టు చంద్రబాబు చెప్పారు. సమాజంలో పేదరికం అన్నది లేకుండా చేయాలనేదే తాన ప్రధాన ఉద్దేశమని అందుకోసం అహర్నిశం కృషిచేస్తున్నట్టు చంద్రబాబు చెప్పారు. దివంగత ఎన్టీఆర్ ను ఆదర్శంగా తీసుకుని పేద ప్రజల కోసం తాను పనిచేస్తున్నానని చెప్పారు. కాపుల విషయంలో తమ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద తీసుకుంటోందని చంద్రబాబు వివరించారు. రైతులను ఆదుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించార. రైతులకు 24వేల కోట్ల రూపాయల మేరకు రుణమాఫీ జరిగిందని వివరించారు. త్వరలోనే ఆంధ్రప్రదేశ్ లో కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేస్తున్నట్టు చెప్పారు.