తెలంగాణలో పొత్తులుంటాయి-బాబు పరోక్ష సంకేతాలు

chandrababu naidu on telangana హైదరాబాద్ కు వచ్చిన చంద్రబాబు నాయుడు స్థానిక టీడీపీ నేతలతో విస్తృతంగా చర్చించారు. తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీ రద్దు, ఎన్నికలు, వివిధ పార్టీలతో పొత్తు అవకాశాలపై ఆయన కార్యకర్తలతో విపులంగా చర్చించారు. కాంగ్రెస్ తో పొత్తు విషయంలో చంద్రబాబు ఆచీతూచీ మాట్లాడారు. స్థానిక నేతలే మరో రెండు రోజుల్లు పొత్తుల విషయంలో నిర్ణయం తీసుకుంటారని బాబు పేర్కొన్నారు. కార్యకర్తలు త్యాగాలు చేశారని, ఎన్నికల్లో కొంతమందికి పోటీ చేసే అవకాశం లేకపోయినా పార్టీ కోసం త్యాగాలకు సిద్ధం కావాలని చెప్పడం ద్వారా పొత్తులు ఉంటాయని చెప్పకనే చెప్పారు. ఆయన ప్రసంగంలోని ముఖ్య అంశాలు…
• తెలంగాణలో బీజేపీ ఓ చారిత్రక అవసరం
• బీజేపీ ముస్లీంల పట్ల వివక్ష చూపుతోంది.
• విభజన వద్దని కానీ, చేయమని కానీ నేను ఎన్నడూ చెప్పలేదు.
• బీజేపీ ప్రభుత్వం ఏపీని మోసం చేసింది.
• అధికారం కోసం కాకుండా సిద్ధంతపరంగా తెలంగాణ కోసం పోరాడుతాం.
• అధికారం శాశ్వతం కాదు వివలువలు శాశ్వతం.
• టీడీపీతో పొత్తులేదని బీజేపీ ఏకపక్షంగా ప్రకటించింది.
• బీజేపీ ప్రత్యర్థులను అణగదొక్కేందుకు ప్రయత్నిస్తోంది.
• బీజేపీ కనీసం మిత్రధర్మాన్ని పాటించలేదు.
• సంస్కరణలకు నాంది పలికింది నేనే.
• హైదరాబాద్ ను అభివృద్ది చేసింది తెలుగుదేశం పార్టీ నే.
• ఐటీని అభివృద్ది చేసింది టీడీపీనే.
• బీజేపీ పై రాజీలేని పోరాటం చేయాల్సిన అవసరం ఉంది.
• ప్రజల మనోభావాలను అనుగుణంగా తెలుగుదేశం పార్టీని నడిపిస్తున్నాం.
• నేను తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉండే అవకాశం లేదు.
• తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎన్నో త్యాగాలు చేసి పార్టీని నిలుపుకున్నారు.
• పార్టీ స్థానిక నాయకులు తెలుగుదేశం, ప్రజల ప్రయోజనాల కోసం నిర్ణయం తీసుకోవాలని పార్టీ నేతలకు చెప్పాను.
టీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా | trs List of mla candidates