కేసీఆర్ వ్యాఖ్యలపై చంద్రబాబు అభ్యంతరం

0
53

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆంధ్రాపాలకుల వల్ల తెలంగాణ దారుణంగా నష్టపోయిందని కేసీఆర్ అనడం సరికాదని బాబు పేర్కొన్నారు. 1995కు హైదరాబాద్ తో పాటుగా తెలంగాణలో జరిగిన అభివృద్ధి 1995 తరువారు జరిగిన అభివృద్దిని బేరూజు వేసుకోవాలన్నారు. తన హయంలో హైదరాబాద్ ను ప్రపంచ నగరాల స్థాయికి తీసుకుని వెళ్లినట్టు బాబు వివరించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్దికి తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధికి పోలికే లేదంటూ కేసీఆర్ అనడం పై కూడా సరికాదన్నారు.
యూపీఏ హయంలో రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించారని ఆయన మండిపడ్డారు. విభజన సంయంలో ఆంధ్రప్రదేశ్ కు పూర్తిగా అన్యాయం జరిగిందన్నారు. దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ తలసరి ఆదాయంతో సహా చాలా వాటిల్లో వెనకబడి ఉందని దీనికి ప్రధాన కారణం విభజన సమయంలో జరిగిన లోపాలే అన్నారు. ప్రస్తుతం ఉన్నదానికంటే ప్రతీఒక్కరికీ మరో 35వేల తలసరి ఆదాయం పెరగాలని అప్పుడే దక్షిణాది రాష్ట్రాలతో సమాన స్థాయికి చేరుకునే అవకాశం ఉందని చెప్పారు.

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here